Telangana Covid-19 updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రెండుమూడు రోజుల నుంచి రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో శనివారం (ఆగస్టు 28) తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2,751 కరోనా కేసులు నమోదు కాగా..  ఈ మహమ్మారి కారణంగా 9 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,166కి పెరగగా.. ఇప్పటివరకు 808 మంది మరణించారు. Also read: V Movie: వస్తున్నా వచ్చేస్తున్నా.. సాంగ్ రిలీజ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలంగాణలో 30,008 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 89,350 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణలో నిన్న 62,300 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,66,643 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 74.3శాతం ఉండగా.. మరణాల రేటు0.67శాతం ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 432 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..


[[{"fid":"191852","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు