Covid-19: తెలంగాణలో నిత్యం 2వేలు దాటుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. . ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 81.54 శాతం ఉండగా.. మరణాల రేటు 0.60 శాతంగా ఉంది.
Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. . ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 81.54 శాతం ఉండగా.. మరణాల రేటు 0.60 శాతంగా ఉంది. అయితే.. గత 24 గంటల్లో శనివారం ( సెప్టెంబరు 19 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 8 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,71,306 కు చేరగా.. మరణాల సంఖ్య 1,033 కి పెరిగింది. ఈ మేరకు ఆదివారం ఉదయం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ
ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,39,700 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 30,573 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా.. శనివారం 53,811 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 24,88,220 నమూనాలను పరీక్షించారు. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 322 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 182, కరీంనగర్ జిల్లాలో 132, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 146, నల్లగొండ జిల్లాలో 124, సిద్దిపేట జిల్లాలో 109 కేసులు నమోదయ్యాయి. IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం