Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. వారం నుంచి 1500లకు చేరువలోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూనే ఉంది. కానీ నిన్న కోలుకున్న వారి సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. అయితే గత 24 గంటల్లో గురువారం ( అక్టోబరు 22 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు (6) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,29,001 కి చేరగా.. మరణాల సంఖ్య 1,298 కి పెరిగింది. Also read: Coronavirus Vaccine: కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,221 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,07,326 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 20,377 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 90.53 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది. Also read: Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు


గురువారం తెలంగాణ వ్యాప్తంగా 38,484 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 40,17,353 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 249 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 111, రంగారెడ్డి జిల్లాలో 97 కేసులు నమోదు అయ్యాయి. Also read: Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 20 ఫైరింజన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe