Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల తగ్గిన కేసులు మళ్లీ 1500ల చేరువులో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా నమోదవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.72 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది. అయితే గత 24 గంటల్లో శుక్రవారం ( అక్టోబరు 30 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు (6) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: LRS last date In Telangana: నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్ గ‌డువు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 238,632 కి చేరగా.. మరణాల సంఖ్య 1,336 కి పెరిగింది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,486 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 218,887 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 18,409 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.  Also read: Turkey Earthquake: 17కి చేరిన మృతుల సంఖ్య.. వందలాది మందికి గాయాలు


ఇదిలావుంటే.. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 41,243 కరోనా పరీక్షలు చేశారు. దీంతో అక్టోబరు 30 వరకు మొత్తం 42,81,991 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 286 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.


[[{"fid":"196160","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"2"}}]]


 


Also read: Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe