Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న వేయికి తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ 1500ల సంఖ్య దాటాయి. అయితే మరణాల మూడుకే పరిమితమైంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. రికవరీ రేటు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 92.12 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతం ఉంది. అయితే గత 24 గంటల్లో సోమవారం ( నవంబరు 2 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,536 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,42,506 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,351 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Alaso read: Bihar Assembly Election 2020: రెండో దశ పోలింగ్‌ ప్రారంభం.. బరిలో తేజస్వీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,421 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,23,413 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 17,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also read: TN Krishnan: తుదిశ్వాస విడిచిన వయోలిన్‌ విధ్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌


ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 45,021 కరోనా పరీక్షలు చేశారు. దీంతో నవంబరు 2వ తేదీ వరకు మొత్తం 43,94,330 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.


[[{"fid":"196458","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe