హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ (Coronavirus) క్రమక్రమంగా విజృంబిస్తోంది. నేడు మంగళవారం ఒక్క రోజే తెలంగాణలో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases in Telangana) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కరోనా పాజిటివ్ కేసులు కూడా ఢిల్లీలోని మర్కజ్ నుంచి వచ్చిన కేసులుగా అధికారులు గుర్తించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు గుర్తించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 97 కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారు. కరోనావైరస్ సోకి ఆస్పత్రిపాలైన వారిలో 14 మంది వ్యాధి బారి నుండి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మరో 77 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు


ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు (Markaz in Delhi) వెళ్లొచ్చిన వాళ్లంతా స్వచ్చందంగా వచ్చి గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని సోమవారమే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి ఈటల రాజేందర్.. కరోనావైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..