Telangana: కొత్తగా 1,763 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
Telangana Covid-19 updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ( మంగళవారం ) రాష్ట్రంలో 1,763 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 8 మంది మరణించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణ ( Telangana ) లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,700కి పెరగగా. కరోనా మరణాల సంఖ్య 719కి చేరింది. Also read: Healh Tips: పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలుసా..?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 20,990 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 73,991 మంది కోలుకున్నారు. దీంతోపాటు ఇప్పటివరకు రాష్ట్రంలో 7,97,470 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే.. రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.31శాతం ఉండగా.. మరణాల రేటు 0.7శాతం ఉంది.
మంగళవారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 484 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 169, రంగారెడ్డిలో 166 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..
[[{"fid":"190992","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణ కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read: Health tips: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం