COVID-19 updates: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. మంగళవారం కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 58,906కు పెరిగింది. ఈ మహమ్మరితో నిన్న 12 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 492కి చేరింది. Also read: Sonu Sood: శారదకు జాబ్ ఆఫర్ లెటర్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 14,663 యాక్టివ్ కేసులు ఉండగా.. 43,751మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే నిన్న 18,858 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 3,97,939 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో 66శాతం మంది పురుషులు, 34శాతం మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో రికవరి రేటు 74.3శాతంగా ఉంది.  Also read: Unlock-3: సినిమాహాళ్లపై సానుకూల నిర్ణయం: కిషన్ ‌రెడ్డి


మహమ్మరి ఎక్కువగా జీహెచ్ఎంసీలో అధికంగా కనిపిస్తోంది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 509 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా వారీగా చూస్తే ఎక్కువగా మేడ్చల్‌లో 158, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్భన్‌లో 138 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కేసుల వివరాలు..ఇలా ఉన్నాయి...


[[{"fid":"188917","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana-corona-cases ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana-corona-cases ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana-corona-cases ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]