హైదరాబాద్: కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (Telangana CoronaVirus Cases) 88,396కి చేరింది. గురువారం (ఆగస్టు 13న) ఒక్కరోజే 9 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 675కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,210 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత సరాసరితో పోల్చితే తెలంగాణలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉంది. గురువారం మొత్తం 22,046 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 356 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది 
కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు


జిల్లాలవారీగా చూస్తే.. మేడ్చల్‌ 168, రంగారెడ్డి 134, సంగారెడ్డి 90, వరంగల్ అర్బన్ 74, కరీంనగర్ 73, ఖమ్మం 71, సిద్దిపేట 63, నిజామాబాద్ 63, వరంగల్ రూరల్ 54, గద్వాల 51, మహబూబ్‌నగర్ 48, సూర్యాపేట 47, కామారెడ్డి 44, వనపర్తి 41, జగిత్యాల 40 కోవిడ్19 పాజిటివ్ కేసుల చొప్పున   నిర్ధారించారు.  అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos 
Photos:
 అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..