Hyderabad: హైదరబాద్‌లో హైటెన్షన్.. నెల రోజుల పాటు అమల్లోకి 163 సెక్షన్ .. సీపీ కీలక ఆదేశాలు..
144 section imposed in Hyderabad: హైదరబాద్ వ్యాప్తంగా నెల రోజుల పాటు భారత న్యాయసంహితలోని కొత్త చట్టం 163 సెక్షన్ ను విధిస్తు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
163 section imposed in Hyderabad: హైదరబాద్ లో కొన్నిరోజులుగా తరచుగా ధర్నాలు, రాస్తారోకోల వంటి అనేక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో హైదరబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇది దెబ్బతీసేదిగా మారిందని సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్ లో నెల రోజుల పాటు భారత న్యాయ సంహిత చట్టంలోని 163 సెక్షన్ ను విధిస్తు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి ఉండదు. అంతే కాకుండా.. ఒకే చోట నలుగురు కన్న ఎక్కువగా మంది గుమిగూడితే మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఇటివల హైదరబాద్ లో.. గ్రూప్ 1 అభ్యర్థుల రచ్చ, ఆ తర్వాత ముత్యాలమ్మ ఆలయం ఘటనలు పోలీసులకు చుక్కలు చూపించాయని చెప్పవచ్చు. అంతే కాకుండా.. తాజాగా, జన్వాడ్ రేవ్ పార్టీ ఘటన కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా మారిపోయిందని చెప్పుకొవచ్చు. దీంతో నాయకులు సవాళ్లు , ప్రతి సవాళ్లు వేసుకుంటూ శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేస్తున్నారని కూడా పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి అనేక సూచనలు వచ్చాయి. మరోవైపు పాతబస్తీలో ఇటీవల మాజీద్ వర్సెస్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ల గొడవ కూడా పెద్ద రచ్చకు దారితీసిందని చెప్పుకొవచ్చు. సీపీ సీవీ ఆనంద్ ఇద్దరికి ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇటీవల చాలా ఇటు పొలిటికల్ పార్టీలు, నిరుద్యోగ అభ్యర్థులు సెక్రెటెరియట్ ను ముట్టడించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. దీంతో హైదరబాద్ లో సామాన్య జనజీవనం చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తొంది. పలు చోట్ల ట్రాఫిక్ కు అనేక సమస్యలు ఏర్పడిట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సీపీ సీవీ ఆందన్ ఈ మేరకు నెల రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా 163 సెక్షన్ ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరు కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించకూడదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. కొంత మంది కావాలని సోషల్ మీడియాలో నెల రోజుల పాటు కర్ఫ్యూ అంటూ కూడా పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని సీపీ ఆనంద్ సీరియస్ అయ్యారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ నెల రోజుల ఆదేశాలకు , దీపావళికి సంబంధంలేదని క్లారిటీ ఇచ్చారు.
Read more: One Police-One State: కానిస్టేబుల్స్ కుటుంబాల ఆవేదన.. సీఎం రేవంత్, డీజీపీకి కన్నీటి లేఖ
కొన్ని అల్లరి మూకలు సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్ భవన్ల ముట్టడికి ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఇది కర్ఫ్యూ కూడా కాదు. కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సీపీ సీవీ ఆనంద్ క్లారిటీ ఇస్తు ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.