TS CPGET-2022: తెలంగాణ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(CPGET) నోటిఫికేషన్‌ వెలువడింది. నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్‌. లింబాద్రి విడుదల చేశారు. సీపీగెట్‌ ద్వారా ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూహెచ్‌, మహిళా యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. నేటి నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలస్య రుసుము రూ.500తో జూలై 11 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 20 నుంచి సీపీగెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. సీపీగెట్‌ ద్వారా ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూహెచ్‌తోపాటు మహిళా వర్సిటీల్లోని బీఏ,బీకాం, బీఎస్సీ,బీబీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలను భర్తీ చేయనున్నారు.


మొత్తం 8 యూనివర్సిటీల పరిధిలో 320 కళాశాలలు ఉన్నాయి. 50 కోర్సుల్లో 44 వేల 604 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీలో చదివిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కోర్సుల్లో పీజీ చేసేలా ఈసారి నిబంధనలు సవరించారు. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్‌. లింబాద్రి తెలిపారు.


Also read: Pawan Kalyan Comments: హైదరాబాద్‌ గ్యాంగ్ రేప్‌ ఘటనపై పవన్ కళ్యాణ్‌ ఏమన్నారంటే..!


Also read:AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..త్వరలో సాధారణ బదిలీలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook