హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. మహాకూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు. ఈ సందర్భంగా సురవరం ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..తెలంగాణ చరిత్రను ప్రధాని మోడీ వక్రీకరిస్తున్నారని విమర్శించారు..ఆర్ఎస్ఎస్ తప్పా అందరూ నిజాంను ఎదిరించినోళ్లేనని వెల్లడించారు. సర్దార్ పటేల్ ఒక్కడి వల్లే తెలంగాణ విముక్తి కల్గిందని మోడీ చెబుతున్నది వాస్తవం కాదు..రజాకర్లను వ్యతిరేకంగా కమ్యునిస్టులు పోరాటం చేస్తుంటే ..ఆ క్రెడిట్ తమకు దక్కుతుందనే ఉద్దేశంతో అక్కడికి కేంద్ర బలగాలు పంపించారని ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం చరిత్రను వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు..టీఆర్ఎస్ కు మజ్లీస్ మద్దతు


టీఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవానికి  బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుంటే.. టీఆర్ఎస్ కు మజ్లీస్ మద్దుతు ఇస్తోంది..ఇలా ఈ పార్టీలు ఒకరినొకరు సహకరించుకుంటన్నాయని సురవరం ఆరోపించారు. నాలుగేళ్ల పాలలో కేసీఆర్ ఐదు శాతం హామీలను అమలు చేయలేకపోయరని సురవరం విమర్శించారు.