Young Women and Men naked dead bodies found at Abdullahpurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. నగ్నంగా ఉన్న యువతీయువకుడి మృత‌దేహాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలోని ముళ్ల పొదల్లో మృత‌దేహాలు రెండు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతీయువకుడి ఏకాంతంగా ఉన్న సమయంలో దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారసిగూడకు చెందిన యశ్వంత్‌ (22), జ్యోతి (28)గా పోలీసులు గుర్తించారు. శవాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. యువతి ముఖం అయితే గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. సంఘటన స్థలానికి కొద్దిదూరంలోనే బ్యాగ్‌, హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగానే మృతుల వివరాలను కనుక్కున్నారు.


ఆదివారం సాయంత్రం యశ్వంత్‌ ఇంటి నుంచి బయటకి వెళ్లాడని కుటుంబ సభ్యులు పోలీసుల విచారణలో తెలిపారు. తన సోదరుడు కనిపించకుండా పోవడంతో చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు యశ్వంత్‌ సోదరుడు అనిరుధ్‌ చెప్పాడు. జ్యోతి ఎవరో తమకు తెలియదని పేర్కొన్నాడు. గతంలో ఇంటి వద్ద చిన్న చిన్న గొడవలు జరిగాయని, అవి హత్యకు దారితీసే అవకాశం ఉండవని కూడా అనిరుధ్‌ పోలీసులకు చెప్పుకొచ్చాడు.


యువతీయువకుడి మరణించిన ఘటనాస్థలిని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ పరిశీలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అయిండొచ్చని తాము అనుమానిస్తున్నట్టు మీడియాతో చెప్పారు. జ్యోతికి వివాహమైందని.. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. జ్యోతి ముఖంపైన దుండగులు రాయితో కొట్టిన గుర్తులు ఉన్నాయన్నారు. మరోవైపు యశ్వంత్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, నిందితులు అతడి మర్మాంగంపై దాడి చేశారని డీసీపీ చెప్పారు. ఈ హత్యలు ఎవరు చేశారనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Also Read: Srinidhi Shetty Latest Pics:స్టైలిష్ లుక్‌లో శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ హీరోయిన్ అందాలకు కుర్రకారు ఫిదా!


Also Read: Jayawardene Team: రోహిత్, కోహ్లీకి దక్కని చోటు.. భారత్ నుంచి ఒక్కడే! జయవర్ధనే డ్రీమ్ టీ20 టీమ్‌ టాప్ 5 ప్లేయర్స్ వీరే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook