CP Stephen Ravindra Launches CDEW: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ) కౌన్సిలింగ్ కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు డిజిపి అంజనీ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసు శాఖ మహిళల చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు "Safe City Project" లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో CDEW సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ కలహాలతో విడిపోతున్న ఎంతో మందికి వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి CDEW సెంటర్లు దోహదపడతాయన్నారు. ఈ CDEW సెంటర్ల ద్వారా ముఖ్యంగా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కేసులను త్వరతగతిన పరిష్కరించడానికి సాధ్యమవుతుంది అని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.


ప్రతీఒక్కరి జీవితాలలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటిని అర్థం చేసుకుని, బంధాలను నిలబెట్టే విధంగా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ సెంటర్లు తోడ్పడతాయన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించి వారు విడిపోకుండా ఉండేందుకు చూస్తామన్నారు. ప్రతీ CDEW కేంద్రాలలో అనుభవం ఉన్న ఇద్దరు కౌన్సిలర్లను ఏర్పాటు చేశామన్నారు. వీరు కేవలం కౌన్సిలింగ్ నిర్వహించడమే గాక ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారన్నారు.


ఇందులో భాగంగానే మహిళా సమస్యలు, చైల్డ్ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు AV ఆడియో విజువల్ వాహనాన్ని కూడా ప్రారంభించామని అన్నారు. అతి త్వరలోనే మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలోనూ CDEW కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే బాలానగర్ జోన్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో CDEW సెంటర్ ను బాలానగర్ డిసిపి టి శ్రీనివాస్ రావు తమ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. "మీ భద్రతే మా బాధ్యత" అనే మోటోనే మన సైబరాబాద్ పోలీసుల పనితీరును ప్రతిబింభిస్తుంది అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభిప్రాయపడ్డారు.


ఇది కూడా చదవండి : RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?


సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంట W&CSW విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి నితిక పంత్, మేడ్చల్ ట్రాఫిక్ డిసిపి డివి శ్రీనివాస్ రావు, పేట్ బషీరాబాద్ ఏసిపి రామలింగ రాజు, మేడ్చల్ లా అండ్ ఆర్డర్ ఏసిపి వెంకట్ రెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి, అల్వాల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్, పేట్ బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్  ప్రశాంత్, షామీర్పేట్ ఇన్‌స్పెక్టర్ సుధీర్, మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ డిఐ లక్ష్మీనారాయణ రెడ్డి, షీ టీం ఇన్‌స్పెక్టర్, షీ టీం ఇంచార్జ్ ఇన్‌స్పెక్టర్ వేణు మాధవ రెడ్డి, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, షీ టీం సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ విభాగానికి చెందిన ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి : FAQs About Rs 2000 Note: 2000 నోటు ఎప్పటివరకు చెల్లుతుంది ? ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చా ?


ఇది కూడా చదవండి : Can we Accept Rs 2000 Notes: రూ. 2000 నోటు తీసుకుంటే సమస్య తప్పదా ? ఏంటా సమస్య ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK