FAQs About Rs 2000 Note: 1) 2000 రూపాయల డినామినేషన్ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ఉపసంహరించుకుంది ?
2016 నవంబర్‌లో RBI చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 500 నోట్లను, 1000 నోట్లను చట్టబద్ధంగా రద్దు చేసిన తరువాత ఆర్థిక వ్యవస్థలోని కరెన్సీ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో కేంద్రం రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరడంతో పాటు ఇతర డినామినేషన్లలో అవసరాలకు అనుగుణంగా నోట్లు అందుబాటులోకి రావడంతో, 2018-19లో కేంద్రం 2000 నోట్ల ప్రింటింగ్‌ని కూడా ఆపేసింది. రూ.2000 డినామినేషన్ నోట్లలో ఎక్కువ భాగం మార్చి 2017కి ముందే జారీ అయ్యాయి. ఇతర డినామినేషన్లలోని నోట్లు ప్రస్తుతం దేశ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయే మోతాదులో ఉంది. ఈ కారణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా “ క్లీన్ నోట్ పాలసీ ” ప్రకారం 2000 రూపాయల డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ స్పష్టంచేసింది.
2) ఇంతకీ క్లీన్ నోట్ పాలసీ అంటే ఏంటి ?
నాణ్యమైన నోట్లు చలామణిలో ఉండేలా ఆర్బీఐ అనుసరించే విధానం పేరే క్లీన్ నోట్ పాలసీ.
3) 2000 రూపాయల నోట్లకు చట్టబద్ధత అలాగే కొనసాగుతుందా ?
అవును, ప్రస్తుతానికి 2000 రూపాయల నోటుకు లావాదేవీల పరంగా యధా స్థితిని కొనసాగుతుంది.
4) సాధారణ లావాదేవీలకు 2000 నోట్లను ఉపయోగించవచ్చా ?
అవును, జనం తమ లావాదేవీల కోసం 2000 రూపాయల నోట్లను ఉపయోగించుకోవచ్చు. అలాగే వాటిని చెల్లింపుల రూపంలోనూ స్వీకరించవచ్చు. కాకపోతే సెప్టెంబర్ 30, 2023న లేదా అంతకంటే ముందే ఆ నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
5) జనం వద్ద ఉన్న 2000 రూపాయల డినామినేషన్ నోట్లను ఏం చేయాలి ?
జనం తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకులో మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉంది. సెప్టెంబర్ 30, 2023 వరకు అన్ని బ్యాంకుల్లో ఈ అవకాశం ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లోనూ రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
6) బ్యాంకు ఖాతాలో 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి ఏదైనా లిమిట్ ఉందా ?
ప్రస్తుతం ఉన్న నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలు ప్రకారం బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితులు లేవు.
7) 2000 రూపాయల నోట్ల మార్పిడిపై ఏదైనా పరిమితి ఉందా ?
జనం తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఒక్కసారికి రూ.20,000/- వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలు ఉంది.
8) 2000 రూపాయల నోట్లను బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా మార్చుకునేందుకు అనుమతి ఉందా ?
అవును, బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా ₹2000 నోట్ల మార్చుకునేందుకు రోజుకు ఒక్కో ఖాతాదారుడికి రోజుకు ₹4000/- వరకు పరిమితి విధించారు.
9) రూ. 2000 నోట్లను మార్పుకునే సౌకర్యం ఏ తేదీ నుండి అందుబాటులోకి వస్తుంది ?
బ్యాంకుల్లో పెరిగే రద్దీని తట్టుకుని సేవలు అందించడం కోసం, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా బ్యాంకులకు సమయం ఇస్తూ మే 23, 2023 నుండి బ్యాంకుల్లో లేదా ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లో నోట్లు మార్పిడి చేసుకోవచ్చు.
10) బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఖాతాదారులే అయ్యుండాలా ?
బ్యాంకులో ఎకౌంట్ లేనప్పటికీ ఒక్కో వ్యక్తి ఒక్కసారికి మొత్తం రూ. 20 వేల వరకు నోట్లు మార్చుకునేందుకు వీలు ఉంది.
ఇది కూడా చదవండి : RBI to Withdraw Rs 2000 Note: బడాబాబులకు మరోసారి షాకిచ్చిన కేంద్రం.. రూ. 2 వేల నోటు మళ్లీ వెనక్కి
11. ఎవరికైనా వ్యాపారం లేదా మరేదైనా ఇతరత్రా అవసరాల కోసం రూ. 20,000/- కంటే ఎక్కువ నగదు అవసరమైతే ?
ఎలాంటి పరిమితులు లేకుండా ఖాతాల్లో మీ సొమ్మును డిపాజిట్ చేయవచ్చు. నిరభ్యంతరంగా రూ. 2000 నోట్లను బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయొచ్చు. ఈ డిపాజిట్ల నుంచి మీకు అవసరమైన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.
12) ఆర్బీఐ రీజినల్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయి ?
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం.
12. జనం తమ వద్ద ఉన్న 2000 నోట్లను మార్చుకోవడం కోసం బ్యాంకులకు ఏదైనా చార్జిలు చెల్లించాల్సి ఉంటుందా ?
నోట్ల మార్పిడి సౌకర్యం ఉచితంగా అందించడం జరుగుతుంది.
ఇది కూడా చదవండి : Xiaomi 12 Pro Price: షావోమి 12 ప్రో ధరపై భారీ తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK