హైదరాబాద్: సోషల్ మీడియాలో పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేస్తూ రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నారని జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదుకు స్పందన లభించింది. సామాజిక మాధ్యమాలు వాట్సాప్, టిక్ టాక్, ట్విట్టర్‌లపై తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధ్వేషాలు రెచ్చగొట్టే వీడియోలు, ఫొటోలు, మెస్సేజ్‌లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని నాంపల్లి కోర్టులో శ్రీశైలం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: మార్చిలో వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్!


సీఏఏతో పాటు ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ పాకిస్థానీయులు నిరసన, ఆందళనలు చేపట్టినట్లు సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 153ఏ, 124, 124ఏ, 121ఏ, 294, 295ఏ, 505, 120బీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఆయా సంస్థలకు నోటీసులు పంపనున్నారు.


See Pics: ప్రేయసితో మాక్స్‌వెల్ చెట్టాపట్టాల్.. ఫొటోలు వైరల్


గతంలో ఎవరినైనా కించ పరిచేలా, తమ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పోస్టులపై బాధితులు ఫిర్యాదు చేయగా.. ఆ వీడియోలు తొలగించాలని సైబర్ పోలీసులు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలకు నోటీసులు అందించేది. అయితే జాతీయ భద్రతకు భంగం వాటిల్లే అంశమని భావించి మతాల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టే చర్యలను అరికట్టడంలో భాగంగా తొలిసారిగా టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్‌లపై కేసు నమోదు చేశారు.


Also Read: తల్లా.. పెళ్లామా.. తేల్చుకోండి: అనసూయ


Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్


 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..