Dakshin Superfast Train Catches Fire: దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య నడిచే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌  (ట్రైన్ నం. 1721) చివరి బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి దాటాక భువనగిరి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. మంటలు చెలరేగింది లగేజీ బోగీలో అని రైల్వే అధికారులు తెలిపారు. రైలును నిలిపివేసిన వెంటనే రల్వే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. సమీప ప్రాంతాల నుంచి ఫైరింజన్స్ వచ్చి మంటలార్పుతున్నట్లు వెల్లడించారు. లగేజీ బోగీలో మంటల కారణంగా అందులోని లగేజీ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. దీని నష్టం ఎంతనేది తెలియాల్సి ఉంది. 


లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేయకపోయి ఉంటే మంటలు ప్యాసింజర్ బోగీలకు అంటుకునే అవకాశం ఉండేది. అదే జరిగితే పెను ప్రమాదం జరిగేది. సిబ్బంది అప్రమత్తం చేయడంతో లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పినట్లయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  బోగీలో మంటలు చెలరేగడానికి గల కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.



Also Read: BJP MEETING: 10 లక్షల మందితో బీజేపీ బహిరంగ సభ.. ప్రధాని మోడీ ప్రసంగంపైనే ఉత్కంఠ!  


Also Read: Horoscope Today July 3rd: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక నెరవేరే ఛాన్స్..


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook