Horoscope Today July 2nd 2022: ఇవాళ ఆయా రంగాల్లోని కొన్ని రాశుల వ్యాపారులకు ఆర్థికంగా కలిసొస్తుంది. పోటీ పరీక్షలు రాసే యువతకు సానుకూల ఫలితాలు ఉంటాయి. రాశిచక్రంలోని మొత్తం 12 రాశుల వారి జాతక ఫలం ఇవాళ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి (Aries)
ఉద్యోగాన్వేషణలో ఉన్న యువకులకు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అనువైన సమయం. వైద్య సంబంధిత వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. ఇతర వ్యాపారాల్లో అనుకున్నంత పురోగతి ఉండకపోవచ్చు. సమయాన్ని వృథా చేయవద్దు. ముఖ్యంగా యువత సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో చింతించాల్సి వస్తుంది.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఆఫీసులో బాస్‌తో విభేదాలు ఏర్పడవచ్చు. అయినప్పటికీ బాస్‌ను కన్విన్స్ చేయడం లేదా సర్దుకుపోవడం చేయాలి. లేనిపక్షంలో ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. బాస్ మాటలు మిమ్మల్ని బాధించినా సంయమనం పాటించండి. ఆఫీసులో మహిళా సహోద్యోగులతో గౌరవంగా మెలగండి. ఈరోజు ధాన్యం వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంది. ధాన్యం అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఒప్పందాలు చేసుకోండి.
మిథున రాశి (GEMINI)
ఆఫీస్ పనులు పెండింగ్‌లో ఉన్నట్లయితే.. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకోండి. ఆ తర్వాతే పనిలో దిగండి. రిటైల్ వ్యాపారులు ఇవాళ లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారంపై మరింత దృష్టి పెడితే.. ఎక్కువ లాభాలు పొందగలరు. యువత ఎప్పటికప్పుడు తమను తాము అప్‌డేట్ చేసుకోవాలి. లేకపోతే వెనుకబడిపోతారు.
కర్కాటక రాశి (Cancer)
ఈ వారు చేపట్టిన కొన్ని అధికారిక పనులు నేటితో పూర్తి అవుతాయి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచండి. ఈమధ్య కాలంలో వాటితో అవసరం పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా కోప్పడి ఆతర్వాత బాధపడవద్దు. వైవాహిక జీవితంలో మీ కోపం కారణంగా మనస్పర్థలు తలెత్తుతాయి. మీ అత్త గారి వైపు నుంచి బహుమతులు అందే అవకాశం ఉంది.
సింహ రాశి (LEO)
చేపట్టిన పనులపై మరింత ఫోకస్ అవసరం. సమయాన్ని వృథా చేయడం వల్ల లక్ష్యానికి దూరమవుతారు. మీ దృష్టి మొత్తం పని పైనే ఉండాలి. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోతే... వ్యూహాత్మక మార్పులు అవసరం. తద్వారా లాభాలు పెరుగుతాయి. యువకులు ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. అది మీకు చేటు చేస్తుంది. కుటుంబమంతా కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo)
ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉంటుంది. మరిన్ని గంటలు ఆఫీసులోనే ఉండక తప్పదు. ఓపికగా ముందుకు సాగాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. డిమాండ్‌కు తగిన సప్లై మేరకు మాత్రమే వస్తువుల స్టాక్ ఉంచుకోవాలి. పోటీ పరీక్షల్లో యువతకు విజయం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. ఇది మీకు, మీ జీవిత భాగస్వామికి మరింత ఆనందాన్ని ఇస్తుంది. జారిపడటం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. కాబట్టి నునుపైన ఫ్లోర్‌పై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి (Libra)
విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది.స్టీల్ సామాను వ్యాపారం చేసేవారు మంచి లాభాన్ని పొందుతారు. ఒకేసారి పెద్ద ఆర్డర్ రావడం వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. యువత తమలోని లోపాలను సరిదిద్దుకోవాలి. కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వివాదాల్లో తలదూర్చవద్దని గుర్తుంచుకోండి.
వృశ్చిక రాశి (Scorpio)
మీడియా రంగంలోని ఈ రాశి వారికి కలిసొస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. పెద్ద మీడియా సంస్థ నుంచి ఆఫర్ పొందుతారు. వ్యాపారవేత్తలకు కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థితి ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ పిల్లలు మీకు మరింత ఆనందాన్ని తీసుకొస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius)
కొత్తగా ఉద్యోగంలో చేరినట్లయితే చాలా జాగ్రత్త అవసరం. వ్యాపారస్తుల ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. యువత తాము చేపట్టిన లేదా అనుకున్న పనులు జరగకపోతే చింతించకండి. సీనియర్లను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. కుటుంబ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకర రాశి (Capricorn)
తొందరపాటు నిర్ణయాలు వద్దు. దుస్తుల వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. అయినా బాధపడవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అన్నీ మీకు అనుకూలిస్తాయి.
కుంభ రాశి (Aquarius)
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే ఉద్యోగులు ఆ ప్రయత్నాలను కొనసాగించాలి. ఆ దిశగా విజయం చేకూరే అవకాశం ఉంది. చిల్లర వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. యువత తమ పనుల కోసం హడావుడిగా పరిగెత్తాల్సి వచ్చింది. తోబుట్టువులతో సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల ఆశీస్సులతో కొన్ని పనుల్లో విజయం లభిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. యోగా, వ్యాయామం చేయాలి.
మీన రాశి (Pisces)
ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. హార్డ్ వేర్ వ్యాపారులకు కలిసొస్తుంది. క్రీడారంగంలో ఉన్న యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. యువత తల్లిదండ్రులను గౌరవించాలి. వారితో మర్యాదపూర్వకంగా మెలగాలి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పోషక ఆహారాన్ని తీసుకోవాలి. లేనిపక్షంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. పోటీ పరీక్షలు రాసే యువతకు సానుకూల ఫలితాలు ఉంటాయి.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: BJP MEETING: 10 లక్షల మందితో బీజేపీ బహిరంగ సభ.. ప్రధాని మోడీ ప్రసంగంపైనే ఉత్కంఠ!
Also Read: దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ రైల్లో మంటలు... వెంటనే నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook