Protests Against Agnipath scheme: హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పాటు రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కూడా కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ ఘటనకంటే ముందుగానే బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అగ్నిపథ్ పథకంపై నిరసనలు పెల్లుబికినప్పటికీ.. ఆయా ఘటనల్లో ఇండియన్ రైల్వేకి చెందిన ఆస్తులు మాత్రమే ధ్వంసమయ్యాయి కానీ ఇలా కాల్పులు జరిపి ఒకరు ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితి వరకు రాలేదు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకున్న విధ్వంసం, కాల్పులు ఘటన దేశవ్యాప్తంగా చర్చనియాంశమైంది.
ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రంగా పనిచేస్తోన్న రైల్వే పోలీసు అధికారులు సికింద్రాబాద్ ఘటనపై స్పందించారు. శుక్రవారం నాడు జరిగిన పరిణామాలను వరుస క్రమంలో వివరిస్తూ అసలేం జరిగిందనే విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు.
సికింద్రాబాద్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అసలేం జరిగిందంటే.. పాయింట్ టు పాయింట్ క్లుప్తంగా..
శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో 3వ నెంబర్ గేటు ద్వారా 300 మంది ఆందోళనకారులు ఎవ్వరికీ అనుమానం రాకుండా సాధారణ ప్రయాణికుల తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించారు.
ఆందోళనకారులంతా రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించిన అనంతరం అగ్నిపధ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
ఉన్నట్టుండి కర్రలు, రాడ్లతో మరో 2000 మంది ఆందోళనకారులు రైల్వే స్టేషన్ పరిసరాల్లోకి చేరుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
అప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉన్న రైళ్లపై దాడి చేసి కిటికీలు, అద్దాలు ధ్వంసం చేసిన అందోళనకారులు.
రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడుతున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు.
ఆందోళనకారులను నిలువరించేందుకు మరింత మంది పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవడంతో వారి చేతికి చిక్కకుండా రైల్వే ట్రాక్‌పైకి పరుగులు తీసిన ఆందోళనకారులు
రైల్వే ట్రాక్‌పై ఉన్న కంకర రాళ్లతో పోలీసులు, అక్కడి వ్యాపార సముదాయాలపైనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డ ఆందోళనకారులు.
ఆందోళనకారుల దాడుల్లో ఏడుగురు పోలీసులు గాయపడగా.. 8 రైళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించిన రైల్వే పోలీసులు.
1వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగి ఉన్న రైలు లోకో ఇంజిన్‌లో 3000 లీటర్ల ఆయిల్ ఉన్న ట్యాంక్‌పైపై దాడి చేసి తగలబెట్టెందుకు ఆందోళనకారులు ప్రయత్నించారని చెప్పిన రైల్వే పోలీసులు.
ఆందోళనకారులను అటుగా వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదన్న పోలీసులు.
ఆందోళనకారులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవడమే కాకుండా.. ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వడం కూడా ఆపలేదన్న పోలీసులు.
ఈ నేపథ్యంలో ఏం చేయలేని పరిస్థితుల్లో అల్లరి మూకలను నిలువరించేందుకు కాల్పులు జరపక తప్పలేదు.
ఈ కాల్పుల్లో గాయపడిన వారిలో వరంగల్ జిల్లాకి చెందిన రాకేష్ అనే యువకుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలైనట్టుగా పేర్కొన్న పోలీసులు.
ఒకవేళ ఆందోళనకారులు లోకో ఇంజిన్‌ను తగలబెట్టి ఉంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ సంఖ్యలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగి ఉండేదన్న పోలీసులు.
ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం, అల్లర్లు కారణంగా 20 కోట్ల మేరకు అస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.
అగ్నిపథ్ పథకం అమలుకు వ్యతిరేకంగా ఉత్తరాదిన బీహార్, హర్యానాలోని రైల్వే స్టేషన్లలో జరిగిన అల్లర్లను చూసే అల్లరి మూకలు సికింద్రాబాద్ ఘటనకు ప్రేరణ పొందినట్టు పోలీసుల వెల్లడి
సికింద్రాబాద్ ఘటనకు ముందే ఇక్కడి వాట్సాప్ గ్రూప్స్‌లోనే వ్యూహరచన చేసుకుని విధ్వంసానికి పాల్పడేందుకు రైల్వే స్టేషన్‌కు (Secunderabad Railway Station Violence) వచ్చారని ఆరోపించిన రైల్వే పోలీసులు.
Also read : Agnipath Scheme Details: అగ్మిపథ్‌పై ఎందుకీ ఆందోళన, కారణాలేంటి, అగ్నిపథ్ అంటే ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.