Delhi Liquor Scam: కడిగిన ముత్యంలా బయటికి వస్తా.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పర్చడానికి బందో బస్తు మధ్య తీసుకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Liquor Case MLC kalvakuntla kavitha Comments On BJP: దేశరాజధానిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో మరింత హీట్ ను పుట్టిస్తుంది. ఒకవైపు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను కోర్టు ఈడీకి అప్పగించింది. అయితే.. ఈరోజుతో (మార్చి 26,2024) తో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు మరల ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హజరు పర్చడానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
ఇది మనీలాండరీంగ్ కేసుకాదు.. పొలిటికల్ లాండరీంగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. తొందరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ.. జై తెలంగాణ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఒక నిందితుడు బీజేపీలో చేరాడు.. ఒక నిందితుడు బీజేపీ నుండి టికెట్ పొందాడు.. ఒక నిందితుడు బీజేపీకి 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చాడంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.
Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
నేపథ్యంలో ఈడీ అధికారులు మరో 15 రోజులు కవితను జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలనికోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా,ఇప్పటికే కవితను 10 రోజుల పాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కవిత కుమారుడికి ఎగ్జామ్ నేపథ్యంలో.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కూడా కవిత తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టు పిటీషన్ పై వివరణ ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. దీంతో రౌస్ అవెన్యూకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook