Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం కల్గిస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది. ముందస్తు షెడ్యూల్ కారణంగా హాజరుకాలేనని కవిత చెప్పడం ఆసక్తి కల్గిస్తోంది. కవిత సమాధానంపై ఈడీ ఇంకా స్పందించలేగదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ విచారణ ఎదుర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈసారి ఈడీ విచారించనుంది. ఇవాళ అంటే మార్చ్ 9వ తేదీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు సాదన విషయమై భారత్ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కవిత ఒకరోజు దీక్షను నిర్వహిస్తున్నారు. ఆ దీక్ష మార్చ్ 10వ తేదీ అంటే రేపు ఉంది. ఇది ముందస్తు షెడ్యూల్ అయినందున తాను ఇవాళ్టి విచారణకు రాలేనని..మార్చ్ 11న విచారణకు హాజరౌతానని కవిత ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కవిత లేఖకు ఈడీ ఇంకా స్పందించకపోవడంతో ఇవాళ ఏం జరగనుందనే టెన్షన్ ఎక్కువైంది. 


మరోవైపు ఇంత హడావిడిగా దర్యాప్తు చేయడంపై కవిత మండిపడ్డారు. స్వల్పకాలంలో విచారణకు పిలవడంపై ఆంతర్యమేంటో అర్ధం కావడం లేదన్నారు. దర్యాప్తు పేరుతో రాజకీయం చేస్తున్నట్టు కన్పిస్తోందన్నారు. తన కార్యక్రమాలు ముందుగానే ఖరారైనందున 11వ తేదీన విచారణకు హాజరౌతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇది జరుగుతోందని కవిత ఆరోపించారు. దేశ పౌరురాలిగా చట్టపరమైన అన్ని హక్కుల్ని తాను ఉపయోగించుకుంటానన్నారు. 


గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశమున్నా..నేరుగా ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యాన్ని ఆమె ప్రశ్నించారు. మహిళను ఆమె నివాసంలో విచారించాలన్న కోర్టు తీర్పును ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. 


Also read: Kavitha Letter: ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు, ఈనెల 10వ తేదీన దీక్ష



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook