Delhi Liquor Scam Latest Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారణకు హాజరు కావాలని శుక్రవారం విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చిన వేళ మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు ఇన్నాళ్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లై ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను అప్రూవర్‌గా మారలేదంటూ షాకింగ్ ప్రకటన చేశారు. ఆ ప్రచారం అంతా అబద్దం అంటూ కొట్టిపారేశారు. ఈ వార్తలు కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా..? లేదా..? అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఈడీ నోటీసులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత కొట్టిపారేసిన నేపథ్యంలో హాజరుకాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ముందుగా పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో కవిత నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ లీగల్ టీమ్ ఈడీ నోటీసులను పరిశీలిస్తోందని.. వారి సూచనల మేరకు నడుచుకుంటానని ఇప్పటికే కవిత చెప్పిన విషయం తెలిసిందే. ఆమె ప్రకటన చేసిన కాసేపటికే.. అరుణ్ పిళ్లై తాను అప్రూవర్‌గా మారలేదంటూ చెప్పడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయోనని ఆసక్తి నెలకొంది.


మరోవైపు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ నాయకురాలు విజయ శాంతి స్పందించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదని. ఆ ఆవశ్యకత కూడా లేదని స్పష్టం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించిన ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయన్నారు. "ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావంతో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆర్ఎస్‌కు ఉందేమో గానీ.. జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు. 


గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నది. ఇక ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు.. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటాది." అని విజయ శాంతి ట్వీట్ చేశారు.


Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  


Also Read: Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook