ED Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతుందోనని సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. గురువారం ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకావాల్సి ఉండగా.. తాను హాజరుకాలేనని ఆమె తెలిపారు. ఢిల్లీలో హైడ్రామా నడుమ ఈ కేసులో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ ముందుకు రావాల్సి ఉండగా.. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తాను విచారణకు హాజరుకాలేనని చెప్పారు. ఈడీ నోటీసుల జారీ చేయడంపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చిన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆమె అనుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈడీ మాత్రం మరో ట్విస్టు ఇచ్చింది. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని మరో నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పుకు ముందే విచారణకు రావాలని కోరింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లై కస్టడీని కూడా ఈ నెల 20వ తేదీ వరకు పొడగించింది. కవితతో కలిసి పిళ్లైను విచారించాలనే యోచనలో ఉన్న ఈడీ.. ఈ నెల 20న విచారణ హాజరవ్వాలని కవితకు నోటీసులు పంపించింది. 


తాను విచారణకు హాజరుకాలేనంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సుప్రీంకోర్టులో తన కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నామని.. అప్పటివరకు తన విచారణ వాయిదాలన్నారు. నళిని చిదంబరం కేసులో మహిళ హాజరు కోసం తాము ఒత్తిడి చేయమని కోర్టుకు ఈడీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు. తన లాయర్ భారతి ద్వారా తన బ్యాంక్ లావాదేవీలు, వ్యాపార వివరాలన్నీ పంపుతున్నట్లు తెలిపారు. ఆయన మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లి డాంక్యుమెంట్లను సమర్పించారు. 


కవిత మాజీ ఆడిటర్, సౌత్ గ్రూప్ సభ్యుడు బుచ్చిబాబు వాంగ్మూలాన్ని ఈడీ బుధవారం నమోదు చేసింది. ఈ వాంగ్మూలం ఆధారంగా ఈడీ ప్రశ్నలు సిద్ధం చేసింది. గురువారం కవిత విచారణకు హాజరైతే ఈ మేరకు సమాచారం రాబట్టాలని ఈడీ భావించింది. అయితే ఆమె హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఈ నెల 24వ తేదీ వరకు గడువు కోరగా.. ఈడీ మాత్రం 20నే విచారణకు హాజరు కావాలని స్పష్టంచేసింది. 


Also Read: Helicopter Crash: కూప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్  


Also Read: AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి