MLC K Kavitha Sensational Comments On BJP And  CBI: లోక్ సభ ఎన్నికల వేళ  ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసు పెను సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టుచేసింది. అదే విధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీకవితకు తాజాగా, రౌసె అవెన్యూ కోర్టు ఈనెల 23 వరకు జూడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టితో కవిత సీబీఐ కస్టడీ ముగియడంతో.. కోర్టులో హజరుపర్చారు. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉండగా.. కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇది  సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా అవే ప్రశ్నలను తిప్పి తిప్పి అడుతున్నరంటూ ఆమె పేర్కొన్నారు. బైట బీజేపీ నేతలు మాట్లాడిన మాటలనే సీబీఐ తమను అడుగుతుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..


ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మార్చి 15 న ఆమె ఇంట్లో అరెస్టు చేశారు. అదే విధంగా.. పదిరోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీ అనంతరం తిరిగి రౌస్ అవెన్యూలో అధికారులు హజరుపర్చారు. ఈ క్రమంలో.. మార్చి 26 న రౌస్ అవెన్యూకోర్టు కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇక ఇదే కేసులో సీబీఐ కూడా కవితనకు విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అరెస్టు చేసి విచారణ జరిపింది. తాజాగా, సీబీఐ గడువు ముగియడంతో సీబీఐ కోర్టులో కవితను హజరుపర్చారు.దీంతో సీబీఐ కోర్టు ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 23 వరకు జూడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. 


దేశంలో ఒకవైపు లోక్ సభ ఎన్నికలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. తెలంగాణాలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ఒకవైపు, లిక్కర్ స్కామ్ లు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. మరోవైపు ఏపీలో రాజకీయ పార్టీల కీలక నేతలపై రాళ్లదాడుల ఘటనలు వివాదస్పదంగా మారాయి.


Read More: Smita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో..


విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై , తెనాలిలో వారాహి సభలో జనసేన పవన్ కళ్యాణ్‌ పై, చంద్రబాబుపై కూడా రాళ్లదాడి ఘటనలు జరిగాయి. దీంతో జీరో వయోలెన్స్ గా ఎన్నికలు జరగాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు విరుద్ధంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఘటనలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై తీవ్రమైన చర్యలకు ఈసీ సిద్దమైనట్లు కూడా సమాచారం. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter