Delhi liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనంగా మారింది. ఇవాళ రెండవసారి కవితను ఈడీ విచారిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఈడీ రెండవ దఫా విచారణకు ఎమ్మెల్సీ కవిత ఈనెల 16 వతేదీనే హాజరుకావల్సి ఉంది. కానీ తన స్థానంలో తన న్యాయవాదిని పంపి..కొన్ని కారణాలతో హాజరుకాలేనని మరో తేదీ సూచించాలని విన్నవించారు. అదే సమయంలో తాను దాఖలు చేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున ఈనెల 24వ తేదీన తీర్పు వెలువడేవరకూ సమయం ఇవ్వాలని కోరారు. కానీ ఈడీ మాత్రం ఈ నెల 20 అంటే ఇవాళ విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపింది. ఈ నేపధ్యంలో ఆమె విచారణకు హాజరౌతారా లేదా అనేది సందేహంగా మారింది. ఒకవేళ హాజరైతే పర్యవసానం ఎలా ఉంటుంది, హాజరుకాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఎందుకైనా మంచిదే ఆలోచనతో నిన్న సాయంత్రం సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, న్యాయవాది భరత్, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. 


ఇవాళ మొత్తానికి అందరి అనుమానాలకు తెరదించుతూ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమె వెంట భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50  ప్రకారం ఈడీ అధికారులు దాదాపు 5 గంటలుగా కవితను విచారిస్తున్నారు. ఢిల్లీ ,హైదరాబాద్ సమావేశాల్లో చర్చకొచ్చిన వివిధ అంశాలపై కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ముఖ్యంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితపై ఈడీ ఆరోపణలు సంధిస్తోంది. వీటికి సంబంధించి వివరణ కోరుతూ పలు కీలకాంశాలపై ప్రశ్నలు సంధిస్తోంది. ముఖ్యంగా కేసులో నిందితుడైన అరుణ్ పిళ్తైతో కలిపి విచారణ కొనసాగిస్తోంది ఈడీ.


కవితను ఈడీ ప్రశ్నిస్తున్న అంశాలివే


ఢిల్లీ లిక్కర్ స్కాంలో వెలుగు చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆమె పాత్ర, మద్యం కుంభకోణంలో ఆమె భాగస్వామ్యం, నిందితులతో ఆమెకున్న సంబంధాలు, ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఆధారంగా కూడా కవితను క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇండో స్పిరిట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా లేదా, విజయ్ నాయర్‌ని 2021 మార్చ్ 19,20 తేదీల్లో కలిశారా లేదా, సిసోడియాను కలిశారా, మాట్లాడారా వంటి విషయాలపై సమాధానం రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని సమాచారం. 


Also read; Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో పరిణామం, సీబీఐ వైఖరిపై భాస్కర్ రెడ్డి పిటీషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook