Delhi to Hyderabad flight ticket Charges: ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎయిర్ లైన్స్ సంస్థలు ఊహించని షాక్ ఇచ్చాయి. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని తమ ప్రియతమ నేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో కొంతమంది నేతలు, కార్యకర్తలు హడావుడిగా ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. అయితే, ముందస్తు ప్రణాళికలు లేకుండా ఫ్లైట్ టికెట్స్ తీసుకుని ఢిల్లీకి వెళ్లిన సదరు నేతలు, కార్యకర్తలు.. ఢిల్లీకి వెళ్లడానికి ముందు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయ్యాకా హైదరాబాద్ కి తిరిగి వద్దామని అనుకుంటున్న తరుణంలో విమానయాన సంస్థలు వారికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్స్ కి టికెట్ రేట్లు భారీగా పెంచేశాయి. సాధారణంగా ఎప్పుడూ ఉండే టికెట్ ధరల కంటే మూడ్నాలుగు రెట్లకు మించి టికెట్ ధరలు పెరిగాయి. ఈ ఊహంచని పరిణామానికి అవాక్కవడం సదరు నేతలు, కార్యకర్తల వంతయ్యింది. ఫ్లైట్ టికెట్స్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్న వారు హైదరాబాద్ కి తిరిగి రాగా.. రిటర్న్ టికెట్ లేని వారు అంత ధర వెచ్చించలేక ఢిల్లీలోనే ఆగిపోయారని తెలుస్తోంది. 


తెలంగాణ నుంచి వేల సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లడం వల్లే ఢిల్లీ టు హైదరాబాద్ మార్గంలో ఫ్లైట్ టికెట్ ధరలు అమాంతం పెరిగి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఢిల్లీకి వెళ్లి తమ బాస్ కేసీఆర్‌ని నేరుగా కలిసి ప్రసన్నం చేసుకోవాలని భావించిన నేతలకు ఈ ఊహించని పరిణామం షాకిచ్చింది. దీంతో ఖంగు తిన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆ షాక్‌లోంచి ఇంకా తేరుకోలేదని సమాచారం.


ఇది కూడా చదవండి : Mother And Daughter: ఎస్ఐ ఈవెంట్స్‌లో సత్తా చాటిన తల్లీ కూతుళ్లు.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ


ఇది కూడా చదవండి : Man stuck in Caves: గుహలో చిక్కుకున్న రాజును రక్షించిన రెస్క్యూ టీమ్.. అశోక్ పాత్ర కీలకం


ఇది కూడా చదవండి : High Tech Cheating: పోలీసుల్లో చేరేందుకు ఎం సీల్ సాయం.. పాపం ఇలా దొరికేసిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook