/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Man stuck in Caves Rescued: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట శివారులో మంగళవారం గుహలో చిక్కుకున్న రాజుని రెస్యూ టీం క్షేమంగా ప్రాణాలతో బయకు తీసుకువచ్చారు. దాదాపు 18 గంటల పాటు శ్రమించి అధికారులు రాజును గుహ నుంచి వెలికి తీశారు. గుహలో చిక్కుకున్న ట్రామాలో ఉన్న రాజును వైద్య సహాయం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం నుంచి రాళ్ళ గుహలో చిక్కుకుపోయాడు. సింగరాయపల్లి అటవి ప్రాంతంలో వేటకు వెళ్ళిన రాజు తన సెల్ ఫోన్ రాళ్ల మధ్య జారిపోవడంతో దాని కోసం దిగి మధ్యలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కాగా రాజును గుహ నుంచి బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్‌కు అశోక్ చాలా సహాయం చేశాడు. ఎవరూ చేయలేని సాహసం చేసి కిందనుంచి గుహ లోపలికి వెళ్లి.. రాజు పరిస్థితి తెలుసుకొని పోలీసులకు వివరించారు. అలాగే రాజు గుహలో చిక్కుకున్న పొజిషన్ ను అధికారులకు వివరంగా చెప్పడంతో బండరాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు అనుకూలంగా ఉందని చెప్పడం వల్ల పోలీసులకు ఈ రెస్క్యూ ఆపరేషన్ సులభంగా మారింది.

ఒక రకంగా చెప్పాలంటే రాజు స్నేహితుడు అశోక్ చేసింది ముమ్మాటికి సాహసంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా గుహ లోపలికి వెళ్లినా.. వారు తిరిగి బయటకు వస్తారో రారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అశోక్ తన ధైర్యం చేసి, ప్రాణాలకు తెగించి లోనికి వెళ్లి రాజుకు ఆహారం ఇవ్వడం అక్కడి పరిస్థితులు అధికారులకు తెలపడంలో అతని కృషి చాలానే ఉంది అని అధికారులు అభినందించారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లో జిల్లా ఎస్పీ.. సీఐ, ఎస్ఐ, ఇతర ప్రభుత్వ అధికారులందరూ కీలకంగా పాత్ర పోషించారు. గుహ నుంచి ప్రాణాలతో బయటపడ్డ రాజు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇది కూడా చదవండి : Delhi - Hyderabad flights: ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఊహించని షాక్

ఇది కూడా చదవండి : Mother And Daughter: ఎస్ఐ ఈవెంట్స్‌లో సత్తా చాటిన తల్లీ కూతుళ్లు.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ

ఇది కూడా చదవండి : High Tech Cheating: పోలీసుల్లో చేరేందుకు ఎం సీల్ సాయం.. పాపం ఇలా దొరికేసిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
raju, a man who stuck in caves rescued in ramareddy mandal of kamareddy district
News Source: 
Home Title: 

Man stuck in Caves: గుహలో చిక్కుకున్న రాజును రక్షించిన రెస్క్యూ టీమ్.. అశోక్ పాత్ర కీలకం

Man stuck in Caves: గుహలో చిక్కుకున్న రాజును రక్షించిన రెస్క్యూ టీమ్.. అశోక్ పాత్ర కీలకం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Man stuck in Caves: గుహలో చిక్కుకున్న రాజును రక్షించిన రెస్క్యూ టీమ్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, December 16, 2022 - 04:26
Request Count: 
24
Is Breaking News: 
No