Yadadri Temple: ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం త‌ర‌హాలోనే యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డును అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి గుట్ట ప‌విత్ర‌త కాపాడేలా చ‌ర్య‌లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. యాదాద్రిని తెలంగాణ ఇలవేల్పుగా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dearness Allowance: హెచ్‌ఆర్‌ఏ, డీఏ ఎప్పుడు ఇస్తారు? యూనివర్సిటీ ఉద్యోగుల పోరుబాట


తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల (టీటీడీ) త‌ర‌హాలోనే యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సీఎం సూచించారు. యాద‌గిరిగుట్ట బోర్డు నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై చర్చించారు.


Also Read: Reddy Women: తీన్మార్ మల్లన్నకు 'రెడ్డి మహిళల' షాక్.. నాలుక చీరేస్తామని హెచ్చరిక


తిరుమ‌లలో మాదిరే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలో రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌ని ముఖ్యమంత్రి చెప్పారు. ఆల‌య ప‌విత్ర‌త కు భంగం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నియామ‌కంతో పాటు ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, సేవా కార్య‌క్ర‌మాల‌పై ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు ముఖ్య‌మంత్రి ‌పలు మార్పులు చేశారు. వీటితోపాటు మరికొన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. ఈ స‌మీక్ష సమావేశం‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.