ఆర్టీసీ సేవల్లో సమస్యలా ? అయితే, డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్
డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్
హైదరాబాద్: మీరు గ్రేటర్ హైదరాబాద్ వాసులా ? మీ ప్రాంతంలో ఆర్టీసీ సేవల్లో లోపాలు ఉన్నాయా ? ఆర్టీసీ సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయా ? ఆర్టీసీ సిబ్బంది సమయపాలన పాటించడం లేదా ? గ్రేటర్ ఆర్టీసీ సేవలకు సంబంధించిన ఎటువంటి సందేహాలకైనా నేడు సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి మీ సమస్యలు తెలియజేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఓ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు గ్రేటర్ ఆర్టీసీ డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం నిర్వహిస్తోంది. మీరు ఉండే కాలనీలకు బస్సులు రాకపోయినా, రావాల్సిన ట్రిప్పులకన్నా తక్కువ ట్రిప్పులు సేవలు అందించినా, బస్సుల నిర్వహణపై ఎలాంటి సమస్యలైనా అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన రీజినల్ మేనేజర్స్, డిపో మేనేజర్స్ ఫోన్ నెంబర్లను ఆయన ఈ ప్రకటన ద్వారా బహిర్గతం చేశారు.
డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమంలో ప్రయాణికులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ఇలా వున్నాయి..
సి.వినోద్‌కుమార్ (గ్రేటర్ ఆర్టీసీ ఈడీ) - 9989224941
జి.రమాకాంత్ (సికింద్రాబాద్ ఆర్‌ఎం) -9959900808
సి.మాధవరెడ్డి(సికింద్రాబాద్ డీఎం) -9959226142
కుషార్ షాఖాన్ (హైదరాబాద్ ఆర్‌ఎం) -8374499915
ఎన్.సుధాప్రమీల (చార్మినార్ డీఎం) - 9959226129
జి.మాధవరావు (కాచిగూడ ఆర్‌ఎం) -9959226087
జి.దేవదానం (కూకట్‌పల్లి డీఎం) -9959226148
జి.జగన్(కుషాయిగూడ డీఎం) -9959226119
డి.విజయభాను (హయత్‌నగర్ డీఎం) -9959226136