Singareni Diwali Bonus: పండగ అంటే సింగరేణి ఉద్యోగులదే అని చెప్పాలే. మొన్న దసరా పండుగకు ఊహించని రీతిలో బోనస్‌ అందుకున్న ఉద్యోగులు అది ఖర్చు చేయకముందే మరో బోనస్‌ లభించింది. దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఒక్కొక్కరికి రూ.93,750 బోన‌స్ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనికోసం రూ.358 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బోనస్‌తో సింగరేణి ఉద్యోగుల కుటుంబాల్లో దీపావళి కాంతులు ఏర్పడ్డాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana DAs: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి పటాకా.. రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే?


సింగరేణి ఉద్యోగులకు ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్ (పీఎల్ఆర్ఎస్) పేరిట దీపావళి బోనస్ ఇస్తుంటారు. సింగరేణి కార్మికులకు రూ.358 కోట్లు బోనస్‌ రూపంలో చెల్లిస్తున్నట్లు ఉపముఖ్య‌మంత్ భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్‌కు ఆదేశించారు. హైదరాబాద్‌లోని స‌చివాల‌యంలో సింగ‌రేణిపై ఆయన స‌మీక్ష చేసి బోనస్‌ విషయమై ఆదేశాలు జారీ చేశారు. తాజాగా చెల్లించిన బోనస్‌ గతేడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం కావ‌డం గమనార్హం.

Also Read: KTR: బరాబర్‌ జైలుకు పోతా.. రేవంత్‌ రెడ్డి అయ్యకు కూడా భయపడను


దీపావళి బోనస్ శుక్రవారం మధ్యాహ్నంలోపు కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి. దాదాపు 40 వేల మంది కార్మికులకు దీపావళి బోనస్ పడనుంది. జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్‌ను చెల్లిస్తుంటారు. సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కొక్క కార్మికుడికి సగటున రూ.లక్షా 90 వేలు అందాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేల చొప్పున చెల్లింపులు జరిగాయి.


నెల రోజుల వ్య‌వ‌ధిలో దీపావ‌ళి బోన‌స్‌, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద సింగరేణి సంస్థ ఉద్యోగులకు చెల్లించిన మొత్తం రూ.1,250 కోట్లు కావడం విశేషం. దీంతో సింగరేణి ఉద్యోగులు ఒక్కొక్కరు సుమారు రూ.3 లక్షల వరకు అందుకోవడంతో వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. కాగా గతేడాదితో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లింపులు తక్కువ చేసి ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది వచ్చిన లాభాలకు తగినట్టుగా ఇవ్వగా.. ఈసారి వచ్చిన లాభాల్లో తక్కువ శాతం చెల్లింపులు చేశారని కొన్ని సింగరేణి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి