Don’t stop ambulances entering Telangana: TS High Court హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేస్తున్నారనే అంశాన్ని తెలంగాణ హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఆపడం అంటే అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడిన హైకోర్టు... సరిహద్దుల్లో అంబులెన్స్‌ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించింది. హై కోర్టు ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ లిఖిత పూర్వక ఆదేశాలు ఏవీ లేవని తెలిపారు. మరి లిఖితపూర్వకంగా ఆదేశాలు లేకపోతే మౌఖిక ఆదేశాలేమైనా ఉన్నాయా అంటూ హై కోర్టు మరోసారి ప్రశ్నించింది. కోర్టు అడిగిన ఈ ప్రశ్నలకు ఏజీ స్పందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడిగి చెబుతామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తంచేసిన హై కోర్టు.. దేశ రాజధాని ఢిల్లీకి సైతం నిత్యం ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంతో మంది పేషెంట్స్ వస్తుంటారని, వారిని కూడా ఢిల్లీలో అలాగే ఆపేస్తున్నారా అంటూ ప్రభుత్వంపై మండిపడింది. ఒకవైపు కరోనా కారణంగా జనం ప్రాణాలు కోల్పోతుంటే సరిహద్దుల్లో అంబులెన్స్‌లను (ambulances stopped at inter-state borders) ఆపడమేంటని ఆగ్రహం వ్యక్తంచేసింది. హై కోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సభ్యులుగా ఉన్న ప్యానెల్ ఈ వ్యాఖ్యలు చేసింది.


Also read: ఎవరెవరికి e-Pass తప్పనిసరి, ఎవరు ఇస్తారు ?.. క్లారిటీ ఇచ్చిన DGP మహేందర్ రెడ్డి


హైదరాబాద్‌ని ఓ మెడికల్ హబ్‌గా పేర్కొన్న హై కోర్టు.. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారని... వారిని రావొద్దని చెప్పడానికి ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉందో చెప్పాలని నిలదీసింది. ఆమాటకొస్తే.. హైదరాబాద్‌లోని కేర్, అపోలో వంటి ఆస్పత్రుల్లో అంతర్జాతీయ పేషెంట్స్ కూడా చికిత్స పొందుతుంటారని, వారిని కూడా అలాగే అడ్డుకుంటారా అని హై కోర్టు (Telangana High court) మండిపడింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook