Mastan Sai Arrest: సినీ హీరో రాజ్‌ తరుణ్‌-లావణ్య వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన మస్తాన్‌ సాయి అరెస్టయ్యాడు. అయితే లావణ్య విషయంలో కాకుండా డ్రగ్స్‌ కేసులో అతడు అరెస్టవడం కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్‌ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు ఈ క్రమంలోనే మస్తాన్‌ సాయిను కోసం గాలిస్తున్నారు. పలు డ్రగ్స్‌ కేసులో అతడి పేరు ప్రస్తావనకు రావడంతో ఏపీలోని సెబ్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Liquor Policy: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. బిర్యానీ కన్నా తక్కువ ధరకే మద్యం


 


సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ అతడి ప్రేయసి లావణ్య కేసులో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన పేరు మస్తాన్‌ సాయి. తనపై కేసు పెట్టిన సమయంలోనే హీరో రాజ్‌ తరుణ్‌ తెరపైకి అతడి పేరు తీసుకొచ్చారు. అప్పటి నుంచి లావణ్య, మస్తాన్‌ సాయి వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే అతడికి డ్రగ్స్‌ వ్యవహారంలో కూడా సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చాయి. డ్రగ్‌ పెడ్లర్‌గా గుర్తించారు. గతంలో లావణ్య డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ కావడానికి కారణం మస్తాన్‌ అని ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్టయ్యాడు.

Also Read: Massive Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీ విద్యార్థులు ఐదుగురు దుర్మరణం


డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి  తీసుకున్నట్లు సెబ్ పోలీసులు తెలిపారు. హైదారాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్, ఇటీవల డిల్లి నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్న నిందితుడిగా మస్తాన్ సాయి ఉన్నారు. అతడి కోసం గాలిస్తున్న సెబ్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో మస్తాన్‌ సాయిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఉన్న అతడిని అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే మస్తాన్‌ సాయి ఫోన్‌ను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


అతడి ఫోన్‌లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు అమ్మాయిల వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సెల్‌ ఫోన్‌లో ఉన్న వీడియోలపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్‌కు అలవాటు చేయడంతోపాటు అమ్మాయిలను మోసం చేసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడి బారిన పడిన అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మస్తాన్‌ సాయి ఎవరో కాదు గుంటూరులోని మస్తానయ్య దర్గా నిర్వాహకుడు కుమారుడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter