హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కొట్టిన తాగుబోతు
హైదరాబాద్‌లో `డ్రంక్ అండ్ డ్రైవ్` టెస్టులో భాగంగా వాహన చోదకులను ఆపి, పరీక్ష చేస్తున్న పోలీసులపై మద్యం సేవించిన ఓ యువకుడు చేయి చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో "డ్రంక్ అండ్ డ్రైవ్" టెస్టులో భాగంగా వాహన చోదకులను ఆపి, పరీక్ష చేస్తున్న పోలీసులపై మద్యం సేవించిన ఓ యువకుడు చేయి చేసుకున్నాడు. తొలుత తనను కెమెరాలలో చిత్రీకరిస్తున్న పోలీసులను వారించిన యువకుడు.. వారు వినకపోయేసరికి వాగ్వివాదానికి దిగాడు. ఆ వాగ్వివాదంలో తనను కొట్టిన పోలీసులను తిరిగి ఆ యువకుడు కొట్టడం గమనార్హం.
ప్రస్తుతం ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పోలీసులు వెంటనే ఆ యువకుడి కారుని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నందుకు కేసు నమోదు చేయడమే కాకుండా.. డ్యూటీలో ఉన్న పోలీస్ పై చేయి చేసుకున్నందుకు కూడా మరో కేసును నమోదు చేశారు. ఈ యువకుడిని మియాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది.