DSC Aspirants Agitation In Osmania University: కొన్ని రోజులుగా నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా అనేక నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇటు గ్రూప్ 2,3 ఎగ్జామ్ ల పోస్టులను పెంచి, చదువుకోవడానికి సమయం ఇవ్వాలని కూడా విద్యార్థులు నిరసన చేపట్టారు. అదే విధండా డీఎస్సీ అభ్యర్థులు  సైతం.. ఎగ్జామ్ ను రెండు నెలల పాటు వాయిదావేసి, జంబో డీఎస్సీ ప్రకటించాలని కూడా నిరసనలు చేస్తున్నారు. ఇటీవల ప్రజాభవన్ ముట్టడికి విద్యార్థుంతా ప్రయత్నించారు. పోలీసులు ఎక్కడిక్కడ బారికేట్లు, ఇనుప చువ్వలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ ను ముట్డడించడానికి విద్యార్థులు ప్రయత్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పోలీసులు ఎక్కడికక్కడ కూడా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపైన దొరికినవాళ్లను, దొరికినట్లు అరెస్టులు చేశారు. అంతేకాకుండా.. తమగొంతుక విన్పించేందుకు కూడా అవకాశం కూడా ఇవ్వలేదు. ఈనేపథ్యంలో.. విద్యార్థులు నిన్న రాత్రి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఓయూలో అర్ధరాత్రిపూట లైట్ లు లేకున్న కూడా.. అమ్మాయిలు, అబ్బాయిలు సాముహికంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని, పోస్టులు పెంచుతామని చెప్పి, ఇప్పుడు ఇలా చేయడం ఏంటని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ అభ్యర్థులను అరెస్టులు చేస్తున్నారు.


అంతేకాకుండా.. బలవంతంగా కూడా తమ వెహికిల్ లో ఎక్కించుకుని,  మోసుకుని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో  విద్యార్థులు నిన్న రాత్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాడిన పాటలను పాడుతూ... తమ బాధలను అందరితో పంచుకున్నారు. సీఎం రేవంత్.. దయచేసి తమ గోడును వినాలని కూడా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థుల నిరసనలకు బీజేవైఎం తోపాటు, బీఆర్ఎస్ కూడా తమ మద్దతు ప్రకటించాయి. మరోవైపు విద్యార్థులు మాత్రం.. ఇది కేవలం మా స్టూడెంట్స్, జీవితాల సమస్యలు అని  దీన్ని రాజకీయం చేయోద్దంటూ కూడా అనేక విధాలుగా నేతలకు రిక్వెస్టులుచేశారు.


Read more: Virat kohli: విరాట్ కోహ్లి పబ్ పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?


పోలీసులు  యువతులు, యువకులు అని తేడాలేకుండా.. స్టూడెంట్స్ అందర్ని ఎత్తుకుని మరీ తీసుకెళ్లిపోయారు. ఉస్మానియా క్యాంపస్ లో స్టూడెంట్స్ కన్నా.. పోలీసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ గస్తీని ముమ్మరం చేశారు. ఓయూలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోలీసులు విద్యార్థుల్ని అరెస్టులు చేస్తున్న వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి