సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ (Dubbaka ByPoll Counting) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Dubbaka By Election Counting Begins) మొదలైంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం వరకు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలను అటు అధికార టీర్ఎస్‌తో పాటు ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు తమదంటే తమదేనని టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.



 


దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 198756 ఓట్లు ఉండగా.. భారీ సంఖ్యలో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. 82 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో ఉత్కంఠ నెలకొంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టున్నట్లు అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక అసెంబ్లీకి అనివార్యమయ్యాయి.



 


అధికార టీఆర్ఎస్ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత రెడ్డికి టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహా మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాగా, కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మొగ్గుచూపితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్‌దే హవా కనిపించింది. దీంతో రెండు పార్టీలు విజయం తమదేనని అంటున్నాయి. మరికొన్ని గంటల్లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కాన్నాయి.



 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe