Dussehra : దసరా సందర్భంగా రికార్డ్ స్థాయిలో మాంసం, మద్యం అమ్మకాలు
Hyderabad on high as liquor sales : హైదారబాద్వాసులంతా దసరా సందర్భంగా ఎంతో సరదాగా గడిపారు. దీంతో చికెన్, మటన్, మద్యం విక్రయాలు ఒక రేంజ్‌లో జరిగాయి. ఇక మద్యం అమ్మకాలు.. ఈ వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో జరిగాయి. రూ.222.23 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Dussehra 2021 Hyderabad on high as liquor sales rake in over 222 crores chicken mutton Sales too high : హైదారబాద్‌వాసులు దసరా సందర్భంగా ఫుల్ ఎంజాయ్ చేశారు.నగరవాసులంతా ఎంతో సరదాగా గడిపారు. దీంతో చికెన్,(chicken) మటన్, (mutton) మద్యం (Liquor) విక్రయాలు ఒక రేంజ్‌లో జరిగాయి. ఇక మద్యం అమ్మకాలు.. ఈ వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో జరిగాయి. రూ.222.23 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ మధ్య అంటే కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ.75 కోట్లకు పైగా మద్యం విక్రయాలు (Liquor Sales) జరిగాయి.
దసరా సందర్భంగా హైదరాబాద్, (Hyderabad) రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలో 7.78 లక్షల కేసుల లిక్కర్, మరో 2.36 లక్షల కేసులు బీర్లు అమ్ముడయ్యాయి. ఇక గ్రేటర్ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్ (chicken) వినియోగమవుతుంది. అయితే గురు, శుక్రవారాల్లో కలిపి దాదాపు 50 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి.
Also Read : జైలు నుంచి విడుదలైన తర్వాత.. నన్ను చూసి గర్వపడేలా చేస్తా'..: ఆర్యన్‌ఖాన్
మటన్(mutton) ధర కాస్త ఎక్కువగా ఉండడంతో గ్రేటర్ ప్రజలు మటన్ కంటే ఎక్కువగా చికెన్‌కు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇక గత మూడ్రోజుల్లో మటన్ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగాయి. మొత్తానికి దసరా (Dussehra) పండుగ సందర్భంగా చుక్క, ముక్కతో పసందు చేసుకున్నారు నగరవాసులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి