తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఇంకొన్ని రోజులే టీఆర్ఎస్ ప్రభుత్వం: ఉత్తమ్
ముందస్తు ఎన్నికలు సిద్దమా? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.
ముందస్తు ఎన్నికలు సిద్దమా? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. 'ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్దం. 2019లో ఎన్నికలు వచ్చినా.. ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా.. ఈ రోజే వచ్చినా మేం రెడీ. ముందస్తు ఎన్నికలు రావడం తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఇంకొన్ని రోజులే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కేసీఆర్‌ను త్వరగా దించేయాలని జనం కోరుకుంటున్నారు' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్షం పదే పదే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేయకుండా ఎన్నికలకు పోదామా? మీ సంగతి, మా సంగతి ప్రజలు తేలుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సవాల్ చేసిన విషయం విదితమే. టీఆర్ఎస్ పార్టీలో దానం నాగేందర్ చేరిక సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని.. తమ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకముందని.. అవసరమైతే ముందస్తు ఎన్నికలకు రెడీ అని అన్నారు.