Etela Rajender సంచలన వ్యాఖ్యలు, Harish Raoకు సైతం అవమానాలు జరిగాయన్న ఈటల రాజేందర్
Etela Rajender Sensational Comments: సీఎం కేసీఆర్‌పై, రైతు బంధు సహా పలు అంశాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Etela Rajender Sensational Comments: ఉద్యమ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీతో అనుబంధానికి స్వస్తి పలికారు. శామీర్‌పేటలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌పై, రైతు బంధు సహా పలు అంశాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమ పథకాలను తాను ఏనాడూ వ్యతిరేకించలేదని, అయితే అర్హులకు మాత్రమే వాటి ప్రయోజనాలు అందాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించినట్లు తెలిపారు. అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చే రైతు బంధు ప్రయోజనాలను వందల కోట్ల ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఇవ్వొదని సూచించాను. బెంజ్ కార్లలో తిరిగే వారికి రైతు బంధు వద్దంటే తనను తప్పుపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ ఒక్కరైనా ఉన్నారా అని అడిగారు. నయీం లాంటి వ్కక్తులు చంపేస్తామని బెదిరించినా టీఆర్ఎస్ జెండా వదలని వ్యక్తిని తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
Aso Read: Etela Rajender Resigns: టీఆర్ఎస్‌కు ఈటల రాజేందర్ రాజీనామా, 19ఏళ్ల బంధానికి స్వస్తి
టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధన కోసం పోరాడిన వారిని పార్టీ నుంచి బయటకు (Etela Rajender Resigns) పంపుతున్నారని, బయటి వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మంత్రి హరీష్ రావును సైతం ఎన్నో సందర్భాలలో అవమానించారని గుర్తుచేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని తాను, హరీష్ రావు కలిసి ఏర్పాటు చేపిస్తే.. ఇప్పుడు ఆ వ్యవహారాలను సీఎం కేసీఆర్ తన కూతురు కవితకు అప్పగించారని పేర్కొన్నారు.
Also Read: TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు, Late Fee లేకుండా అప్లై
‘పోరాటాలు చేసేందుకు టీఆర్ఎస్(TRS Party) పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. కానీ రాష్ట్రం సాధించుకున్నాక ఏం జరుగుతోంది. ధర్నా చౌక్ లేదు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఏ సంఘానికి హక్కులు లేకుండా పాలన కొనసాగిస్తున్నారు. ధాన్యం కొంటామని చెప్పినా తప్పు పడుతున్నారు. ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తిగా మంత్రి పదవి లభించింది. కానీ బానిసలా బతకాలని ప్రేరేపిస్తున్నారు. కేసీఆర్‌ను చంపుతానంటూ వ్యాఖ్యలు చేసిన వారికి పక్కనే కూర్చోబెట్టుకుని, తనలాగే ఆలె నరేంద్ర, విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook