BRS Parliamentary Meeting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి రాజకీయాలపై దృష్టిసారించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వ్యూహాలకు పదును పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు లోక్‌సభ ఎన్నికలను సరైన వేదికగా వినియోగంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి.. మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నారు. కాలికి గాయం తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని.. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని సూచించారు కేసీఆర్. రాజ్యసభ, లోక్‌సభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీలు, రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి హాజరయ్యారు. వీరితోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పాల్గొన్నారు.


ఈ నెల చివరలో మొదలై.. వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా నాడైనా.. నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని  కాపాడాల్సిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాల్సిన విధానాలపై గులాబీ బాస్ కీలక సూచనలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కూడా ప్రత్యేక వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.


Also Read: KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు


Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook