Harish Rao vs Revanth Reddy: మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితులకు ఇచ్చే పరిహారం విషయమై మరోసారి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. తాము నిర్వాసితులకు గతంలో పెళ్లి కాని ఆడపిల్లలు, మగ పిల్లలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్లు వివరించారు. దమ్ముంటే రేవంత్‌ రెడ్డి మూసి నిర్వాసితులకు అంతటి పరిహారం ఇవ్వాలని సవాల్‌ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్‌ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్‌ రెడ్డి


 


సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై మరోసారి ఘాటుగా సమాధానం ఇచ్చారు. 'మల్లన్న సాగర్ , కొండపోచమ్మ బాధితులకు పాత ఇళ్లకు రూ.694 కోట్లు, ఇంటి యజమానికి ఉపాధి కింద రూ.7 లక్షలు ఇచ్చాం. ఇంట్లో పెళ్లి కాని మగ పిల్లవాడైనా.. ఆడపిల్లలైనా రూ.5 లక్షల ఇచ్చాం' అని వివరించారు.

Also Read: Yadadri Reels: మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి.. యాదాద్రి ఆలయంలో రీల్స్‌, ఫొటోషూట్


 


దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ నిర్వాసితులకు కట్టి ఇచ్చినట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మేము నిర్వాసితులకు  డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గజ్వేల్ పట్టణ నడిబొడ్డున ఇచ్చామని, కేసీఅర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సవాల్‌ విసిరారు. రేవంత్ రెడ్డి కూడా మూసీ నది నిర్వాసితులకు హైదరాబద్‌లోని గచ్చిబౌలిలో ఇళ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


మల్లన్న సాగర్‌లో కేసీఆర్ అన్యాయం చేసిండా లేక మూసీలో రేవంత్ అన్యాయం చేస్తుండా అని ప్రజలు గమనించాలని హరీశ్ రావు సూచించారు. 675 ఎకరాలలో భారత దేశంలో నెంబర్ వన్, ఆర్ అండ్ ఆర్ కాలనీ కేసీఆర్  నిర్మించి ఇస్తే కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోందని విమర్శించారు. హైదరాబాద్‌లో పేదల కోసం కేసీఆర్ అపార్ట్‌మెంట్లు ఇళ్లు కట్టి ఇస్తే మూసీ బాధితులకు ఇచ్చి రేవంత్ డబ్బా కొట్టు కుంటుండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


'మూసీ బాధితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో 470 ఎకరాల్లో ఉన్న భూమిలో మూసీ బాధితులకు కట్టి ఇవ్వాలని హరీశ్‌ రావు కోరారు. ప్రాజెక్ట్ నిర్వాసితులైన 8 వేల బాధితులకు 250 గజాల ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చామని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మల్లన్న సాగర్ నిర్వాసితులకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికైనా మల్లన్న సాగర్ నిర్వాసితులకు మిగిలిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.