Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్‌ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్‌ రెడ్డి

Hyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 20, 2024, 01:01 PM IST
Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్‌ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్‌ రెడ్డి

Hyderabad ISB Leadership Summit: చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు సాధిస్తున్నాయని.. మనం ఎందుకు సాధించలేమని రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. పతకాలు సాధించడం అసాధ్యం కాదని.. తెలంగాణ క్రీడాకారులు కూడా ఒలింపిక్స్‌ పతకాలు సాధించడమే తన లక్ష్యంగా ప్రకటించారు. అందులో భాగంగానే క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు ఐఎస్‌బీ విద్యార్థులు బ్రాండ్‌ అంబాసిడర్లుగా పేర్కొన్నారు.

Also Read: KCR Astrology: మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు రాసి పెట్టుకోండి.. జాతకం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు

 

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ లీడర్‌షిప్ సమ్మిట్‌లో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వం చేస్తున్న కృషి.. కావాల్సిన సహకారం వంటి వాటిపై మాట్లాడారు. ఐఎస్‌బీ విద్యార్థులు తనకు సహకరించాలని.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ విద్యార్థులపై ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read: Land Grab: పోలీసులకే షాక్ ఇచ్చిన కబ్జారాయుళ్లు.. చార్మినార్ స్టేషన్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం

 

'ఐఎస్‌బీలో చదువుకుంటున్న మీరంతా తెలివైనవారు. అసాధారణ విద్యార్థులు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉంది. గాంధీ మొదలుకుని మన్మోహన్ సింగ్ వంటి నాయకులే ఉదాహరణ. ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యం. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు  కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరం' అని తన జీవితం గురించి రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'గొప్ప పనులు చేయడానికి  రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేం' అని పేర్కొన్నారు.

'మీరు మంచి నాయకుడిగా ఎదగాలంటే, ముందుగా   ధైర్యం , త్యాగం అనే రెండు విలువల గురించి ఆలోచించండి. అప్పుడు విజయం సాధిస్తారు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు పెట్టుకోవాలని సూచించారు. స్నేహ భావంతో అందరిని కలుపుకుపోవాలన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులుగా హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌లు అని అభివర్ణించారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలని వివరించారు.

'తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి మీ సహాయం కావాలి. మీరు ఎక్కడికి వెళ్లినా  పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు , సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడండి. దేశంలోని ఇతర నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో , సియోల్‌ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని  కోరుకుంటున్నా' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలోనే  భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది పెద్ద లక్ష్యమని.. కానీ అది అసాధ్యం కాదని పేర్కొన్నారు. తన ప్రభుత్వంతో  రెండు, మూడేళ్లు కలిసి పనిచేయాలని కోరారు.

'స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దక్షిణ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించా. అంతటి చిన్న దేశం ఒలింపిక్స్‌లో అనేక పతకాలు సాధించింది. మన దేశం మాత్రం ఒక్క బంగారు పతకం సాధించలేకపోయింది. నా లక్ష్యం ఒలింపిక్స్.. మనం పతకాలు సాధించడం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News