Harish Rao vs Revanth Reddy: వరదలతో ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించి వారికి భరోసా ఇచ్చేందుకు వెళ్లిన తమపై దాడులు, కేసులు నమోదు చేయిస్తుండడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించాల్సిన సహాయాన్ని తాము చేస్తుంటే ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మాకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని తెలిపారు. రేవంత్‌ తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని హెచ్చరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూ


 


ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 'ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో సిద్దిపేట నుంచి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నాం. మానవ సేవయే మాధవ సేవ అని అందురూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలి' అని కోరారు.


Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు


 


వరద బాధితులకు సహాయం చేయడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలైందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. వరదలపై ప్రభుత్వం ముందే స్పందించి ఉంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని మరోసారి చెప్పారు.


కాంగ్రెస్‌, బీజేపీలు కూడా తమ లాగా సహాయం చేయడానికి ముందుకు రావాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. 'మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అక్కడి ప్రజలు ప్రభుత్వ పై దుమ్ముఎత్తి పోస్తున్నారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయిన దౌర్భాగ్యపు ప్రభుత్వం' అని విమర్శించారు. ఇళ్లు నీళ్లలో మునిగిపోయిన వారికి రూ.రెండు లక్షలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter