Contaminated Water Deaths: బావి నీరు తాగడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపగా.. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన సంఘటన తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. ఈ సంఘటనపై బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా రేవంత్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరి మరణానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే కారణమని స్పష్టం చేసింది. వెంటనే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని.. నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా తాము చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమం సక్రమంగా అమలు చేయకపోవడంతోనే ప్రజలు కలుషిత నీరు తాగి మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. వెంటనే మిషన్‌ భగీరథ కార్యక్రమంలో ఇంటింటికి రక్షిత తాగునీరు అందించాలని కోరారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Water Death: దసరా నాడు విషాదం.. బావి నీళ్లు తాగి ఇద్దరు మృతి, 30 మందికి వాంతులు, విరేచనాలు


 


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సంజీవరావుపేట గ్రామంలో బావి నీరు తాగి ఇద్దరు మృతి చెందగా.. 30 మంది అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. రేవంత్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ఈ ఇద్దరి మరణాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Wine Shop Theft: దసరా పండుగకు లక్షల్లో మద్యం వ్యాపారం.. వైన్స్‌లోకి దూకి రూ.12 లక్షలు చోరీ


 


'తెలంగాణ అంతటా తాగునీరు సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసింది. కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి రాష్ట్రమంతటా తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును కూడా సరిగ్గా నిర్వహించలేకపోతోంది రేవంత్ సర్కార్' అని కేటీఆర్‌ విమర్శలు చేశారు. 'సంజీవరావుపేటలో కలుషిత నీటి సరఫరాతో జరిగిన మరణాలు ముమ్మటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే!' అని స్పష్టం చేశారు.


న్యాయం చేయాలి
'మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి. చికిత్స పొందుతున్నవారికి తగిన సాయం అందించాలి. తెలంగాణలో మరెక్కడా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా' అని కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. మిషన్‌ భగీరథతో నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు బావి నీళ్లు తాగారని తెలుస్తోంది. బావిలో నీళ్లు కలుషితమవడంతో ఈ దారుణానికి దారి తీసిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి