KTR Fires On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తరువాత బీజేపీలో చేరే మొదటి రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు దేశంలో 40 సీట్ల కంటే ఎక్కువ రావని రేవంత్‌కు తెలుసని.. అందుకే రాహుల్ గాంధీకి భిన్నంగా బడభాయ్ మోదీ అంటున్నాడని అన్నారు. రేవంత్ అందుకే జీవితమంతా కాంగ్రెస్‌లోనే ఉంటానని ఏనాడు అనడం లేదన్నారు. రూ.2,500 కోట్లను ఢిల్లీకి రేవంత్ రెడ్డి పంపించారని ఆరోపించారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి అంటూ కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Virat Kohli Video Call: గ్రౌండ్‌లోనే వీడియో కాల్ చేసిన విరాట్ కోహ్లీ.. ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ..!   


"ఈ రోజు కాంగ్రెస్‌కు బీజేపీని ఆపే దమ్ము లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి విచిత్రంగా ఉంది. ఇక్కడ బీజేపీ ఉన్నట్లు ఉంది. అక్కడా రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అంటే.. రేవంత్ మాత్రం బడే భాయ్ బాగుండు అంటారు. అక్కడ అదానీ మంచోడు కాదు అంటే రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40 సీట్లు దాటదు. బీజేపీలోకి వెళ్తారని విమర్శలు చేసినా.. అనవసరమైన వాటిపై అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వాటిపైన మాత్రం స్పందించలేదు.  


నా జీవితమంతా కాంగ్రెస్‌లో ఉంటా అని ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత తన మనుషులతో బీజేపీలో చేరతారు. ఒకవైపు ఇసుక దందా, రైస్ మిల్లర్లపై బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బిల్డర్లను బెదిరించడం.. రియాల్టర్లను బెదిరించడం వంటి వార్తలన్ని బయటకు రాకుండా స్కామ్‌ల పేరు చెప్పి.. ఈ వార్తలనే టీవీలలో తిప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మూడు నెలలుగా ఎందుకు బిల్డింగ్‌లకు అనుమతులు ఇవ్వడం లేదు. డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తామని ఢిల్లీకి 2500 కోట్ల రూపాయలు పంపింది నిజం కాదా..?


కరెంటు ఇయ్యడానికి, రైతుబంధు ఇయ్యడానికి, మహిళామణులకు 2500 ఇయ్యడానికి, 4000 పెన్షన్లు ఇయ్యడానికి చేతకాదు కానీ.. ఇవన్నీ కవర్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్, స్కాముల అంటూ వార్తలు రాపిచ్చుకుంటున్నాడు. నీ చేతులలో అధికారం ఉంది కదా ఏం చేస్తావో చెయ్.. ఎవరెవరు, తప్పులు చేసినా వాళ్ళ పైన చర్యలు తీసుకో.. రేవంత్ రెడ్డికి భయపడే వారేవు లేరు. ఆయన వెంట్రుక కూడా పీకలేడు. ఆయనకు ముఖ్యమంత్రిగా అసలు పని చేసే తెలివి లేదు. రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు గారి పేరు. 24 ఏండ్ల నుంచి పార్టీకి నగరంలో అండగా ఉన్నారు. పద్మారావు గారు పోటీ చేస్తున్నారనగానే పార్టీ గెలుస్తుందని అందరు చెబుతున్నారు." అని కేటీఆర్ అన్నారు.


బీఆర్ఎస్ పార్టీని వీడిన దానం నాగేందర్‌పై ఆయన ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో హత్యలుండవని.. అత్మహత్యలు ఉంటాయని.. దానం నిర్ణయం తప్పు అని ఎన్నికల్లో గెలిచి మనం చూపించాలన్నారు. ఆయన అధికారం కోసం ఆశపడి.. గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్లాడని.. ఖైరతాబాద్ ప్రజలే మన పార్టీని గెలిపించి, ఆయన నిర్ణయం తప్పని నిరూపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. రెండు పడవల ప్రయాణం ఎప్పుడు కూడా మంచిది కాదని దానం విషయంలో అర్థం అవుతుందని.. ఆయనపై ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరి అనర్హుడిగా ప్రకటించేలా చేస్తామన్నారు.
 
"గతంలో అంబర్‌పేట్‌లో ఓడిపోతే అదృష్టవశాత్తు సికింద్రాబాద్ ఎంపీ అయిండు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చేసిన అతిపెద్ద మూడు పనులు.. కురుకురే ప్యాకెట్లు పంచడం, సీతాఫల్‌మండిలో రైల్వే లిఫ్ట్ ఓపెన్ చేయడం.. సింటెక్స్ ట్యాంకులను ఓపెన్ చేయడం. ఇవే కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు చేసిన గొప్ప సేవ. కిషన్ రెడ్డికి ఓటేసేందుకు ఒక్క కారణం లేదు. హైదరాబాద్ నగరం బీఆర్ఎస్‌కు కోటగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్‌ అనే మాటను నగర ప్రజలు నమ్మలేదు, అందుకే క్లీన్ స్వీప్ చేశాం.." అని కేటీఆర్ అన్నారు. 


Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి