Hyderabad: సంచలనం రేపుతోన్న డ్రగ్స్ కేసు.. తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎంపీ రియాక్షన్...
Hyderabad: సంచలనం రేపుతోన్న డ్రగ్స్ కేసు.. తన కొడుకుపై వస్తున్న ఆరోపణల పట్ల మాజీ ఎంపీ రియాక్షన్...
Rave Party Busted in Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో పలువురు ప్రముఖ సినీ, రాజకీయ నేతలు, వీఐపీల పిల్లలు ఉండటంతో ఈ ఘటనపై ఫోకస్ మరింత పెరిగింది. ఇప్పటివరకూ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ తదితరుల పేర్లు ఈ కేసులో బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ తన కొడుకుపై వస్తున్న ఆరోపణల పట్ల స్పందించారు.
తన కొడుకుపై వస్తున్న ఆరోపణలను ఖండించిన అంజన్ కుమార్ యాదవ్.. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. 'నా కుమారుడు అరవింద్ ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అనవసరంగా అరవింద్‌పై అభాండాలు మోపుతున్నారు. రాజకీయంగా ఎదుగుతున్నందునే మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా కుటుంబం అలాంటి వ్యవహారాల్లోకి వెళ్లదు. డ్రగ్స్ కేసులో పోలీసులు నిజానిజాలు తేల్చాలి. ఇకనైనా నగరంలోని అన్ని పబ్‌లను మూసివేయాలి. మద్యపానాన్ని కూడా నిషేధించాలి.' అని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు పబ్ యజమానులు సహా మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి పేర్లు మాత్రం ఇప్పటివరకూ బయటకు వెల్లడి కాలేదు. ఇప్పటివరకూ బయటకొచ్చిన పేర్లు కూడా మీడియాలో ప్రచారం జరుగుతున్నవే తప్ప పోలీసుల నుంచి అధికారిక సమాచారం లేదు. రేవ్ పార్టీలో పబ్ నిర్వాహకులే డ్రగ్స్ సప్లై చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్‌ఎస్‌డి, గంజాయి, కొకైన్‌తో పాటు ఇతర డ్రగ్స్‌ను వాడినట్లు చెబుతున్నారు. పోలీసుల దాడులతో పబ్ కిటికీల్లో నుంచి కొందరు డ్రగ్స్‌ను బయటకు విసిరేయగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Malaika Arora Accident: బాలీవుడ్ నటి మలైకా అరోరా కారుకు ప్రమాదం.. గాయాలతో ఆస్పత్రిలో చేరిక!
Also Read: Viral Video: నడిరోడ్డులో యువతిని కొట్టుకుంటూ వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook