Cabinet Expansion in Telangana:  ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టీ కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే క్యాబినేట్ కూర్పుపై మరోసారి ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో భేటి అయి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిన్న తెలంగాణ గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటి అయిన సంగతి తెలిసిందే కదా. రేపు ఢిల్లీలో కాబోయే మంత్రులెవరనే దానిపై క్లారిటీ రానుంది. అంతేకాదు రాష్ట్రంలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేస్తారా.. ఒకటి లేదా రెండు స్థానాలను భర్తీ చేస్తారా అనేది చూడాలి. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు.. జిల్లాల వారీగా ఎవరెవరకి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 4వ తేదిన మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల మార్పు అంటూ తెలంగాణ సెక్రటేరియట్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న రేవంత్ రెడ్డి.. పీసీసీని తనకు అనుకూలుడైన మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించేందుకు రంగం చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం మహేష్ కుమార్ గౌడ్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిథ్యం లేదు. దీంతో ఆయా జిల్లాల వారికీ ఈ సారి మంత్రివర్గం స్థానం దక్కడం ఖాయం అని తెలుస్తోంది. నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అటు నల్గొండ నుండి రాజగోపాల్ రెడ్డి,బాలు నాయక్ లకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయం అని చెబుతున్నారు. అటు మంత్రివర్గంలో ఉన్న సీతక్కకు హోం శాఖగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.


అటు ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు క్యాబినేట్ బెర్త్ కన్ఫామ్ అని చెబుతున్నారు. అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుండి వాకిటి శ్రీహరి కి లేదా మెదక్ నుండి నీలం మధు కు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. అటు మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్ కు కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నాయి.  ప్రస్తుతానికి 5గురిని మంత్రి వర్గంలోకి తీసుకొని 1 పెండింగ్ పెట్టాలని యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి ఇందులో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందనేది చూడాలి.  మైనారిటీ కోటా నుంచి ఈ సారి మంత్రివర్గం స్థానం కల్పిస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ.


Also read: Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter