Facebook swamiji: పూజలు చేసి పాస్ చేయిస్తాని.. MBBS student ని మోసం చేసిన దొంగ బాబా
MBBS student cheated by fake swamiji on facebook: హైదరాబాద్: పూజలు చేస్తే పాస్ అవుతావని ఆ దొంగస్వామి (Fake Swamiji) చెప్పిన మాటలను నమ్మింది ఆమె. ఆయన అడిగిన వెంటనే రూ.80 వేలు ఇచ్చేసింది. నువ్వు కచ్చితంగా పాస్ అవుతావని చెప్పిన ఆ స్వామీజీ ఆ డబ్బుల్ని దండుకున్నాడు.
MBBS student cheated by fake swamiji on facebook: హైదరాబాద్: సాధారణంగా అందరూ చదివితేనే ఏ పరీక్షలోనైనా పాస్ అవుతారు. కష్టపడితేనే కదా ఫలితం దక్కేది. కానీ.. ఓ ఎంబీబీఎస్ (MBBS student) విద్యార్థిని మాత్రం స్వామిజీని నమ్ముకుంది. పూజలు చేస్తే పాస్ అవుతావని ఆ దొంగస్వామి (Fake Swamiji) చెప్పిన మాటలను నమ్మింది ఆమె. ఆయన అడిగిన వెంటనే రూ.80 వేలు ఇచ్చేసింది. నువ్వు కచ్చితంగా పాస్ అవుతావని చెప్పిన ఆ స్వామీజీ ఆ డబ్బుల్ని దండుకున్నాడు. తర్వాత రెండుసార్లు పరీక్ష ఫెయిల్ కావడంతో లబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది ఆమె. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో (Gachibowli Police Station) ఈ విషయంపై కేసు నమోదైంది.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్‌ఎంజీఈ - ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌లో (Foreign Medical Graduate Examination) పాస్ కావాల్సి ఉంటుంది. అయితే పశ్చిమబెంగాల్‌కు చెందిన 41 సంవత్సరాల మహిళ ప్రస్తుతం హైదరాబాద్‌లోని (Hyderabad) కొండాపూర్‌లో ఉంటోంది.
బిస్వజిత్ ఝా స్వామిజీచే పూజ
2011లో ఈమె విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని స్వదేశానికొచ్చింది. ఎన్నోసార్లు ఎఫ్‌ఎంజీఈ పరీక్ష (FMGE) రాసినా పాస్ కాలేదు. ఈ క్రమంలో బాధితురాలి సోదరి.. తన సోదరి పాస్ కావడానికి ఏదైనా సులువైన మార్గం ఉందా అని ఆలోచిస్తున్న క్రమంలో ఓరోజు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చూసింది. ‘బిస్వజిత్ ఝా’ అనే స్వామిజీ పూజ చేస్తే ఎలాంటి పరీక్షయినా తేలిగ్గా గట్టెక్కొచ్చనేది ఆ పోస్ట్ సారాంశం. వెంటనే బాధితురాలి సోదరి.. ఆ స్వామిజీ ఫేస్‌బుక్ (FaceBook) ఖాతాకు వెళ్లి మెసేంజర్‌లో (Messenger) మెసేజ్ చేసింది. తన సోదరి పడుతున్న ఇబ్బంది గురించి వివరించింది. జాతక దోషాలున్నాయని.. అందుకే ఇలా జరుగుతుందంటూ స్వామిజీ ఆమెకు వివరించాడు. ఆమెకు నమ్మకం కుదరడంతో తన సోదరి ఫోన్ నంబర్ స్వామీజికి ఇచ్చింది.
Also Read : Kerala: ఆవులపై అత్యాచారం..కేరళలో కేసు నమోదు
నమ్మించిన శిష్యులు:
తర్వాత స్వామీజీ శిష్యులు బాధితురాలిని సంప్రందించి వివరాలు తెలుసుకున్నారు. ఆమె హాల్ టిక్కెట్ పంపిస్తే పూజలు చేస్తామని నమ్మించారు. వెంటనే బాధితురాలు హాల్ టిక్కెట్ వాట్సాప్‌లో (Whatsapp) పంపించింది. పూజ చేయాలంటే కొంత ఖర్చవుతుందని నమ్మించారు స్వామిజీ శిష్యులు. దీంతో బాధితురాలు రూ.21,500 పంపించారు.
స్వామిజీ వలలో చిక్కుకున్న చాలామంది బాధితులు:
ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో ఆమె మరోసారి పరీక్ష రాశారు. కానీ ఎప్పటిలాగే మళ్లీ ఈసారి కూడా పాస్ కాలేదు. ఇలా ఎందుకు జరిగిందంటూ స్వామిజీని కోరింది. పూజలో ఏదో లోపం జరిగిందని చెప్పాడు. ఈ సారి కాలభైరవ ప్రత్యేక పూజ చేద్దామని చెప్పాడు. ఈ పూజ చేస్తే కచ్చితంగా పాస్ అవుతావని నమ్మించాడు ఈ కేటుగాడు. దీంతో మళ్లీ ఈ దొంగస్వామిజీ అడిగినంత డబ్బులు పంపించారు.. ఈ ఏడాది కూడా ఆమె పాస్ కాలేదు. ఎందుకిలా జరిగిందని పలుమార్లు ఫోన్ చేస్తే అవతలి వైపు నుంచి స్పందన లేదు. తాను మోసపోయినట్లు గుర్తించిన ఎంబీబీఎస్ స్టూడెంట్ (MBBS Students) పోలీసులను ఆశ్రయించింది. ఈ స్వామీజీ ఇలా చాలా మందినే మోసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
Also Read : Taliban Kills Pregnant Policewoman: గర్భిణీగా ఉన్న పోలీసును కాల్చి చంపిన తాలిబన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook