Kerala: మహిళలనే కాదు.. పాలిచ్చే ఆవులను కూడా వదలడం లేదు కొందరు మృగాళ్లు. అర్థరాత్రి ఇంటిముందు కట్టేసి ఉంచిన ఆవులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వాటిని విచక్షణరహితంగా కొట్టి పైశాచిక అనందాన్ని పొందుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఆవులపై అత్యాచారం చేస్తూ.. ఎవరికి చిక్కకుండా తిరుగుతున్న ముఠాపై స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారు ఆవులను ఇతరలకు అమ్మేందుకు సిద్దమయ్యారు. ఈ ఘటనపై కేరళ(Kerala)లో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే..
కేరళ(Kerala) రాష్ట్రంలోని కొల్లం జిల్లా మయనాడ్ రైతులు తమకు చెందిన పాలిచ్చే ఆవులను అమ్ముకుంటున్నారు. ఇందుకు కారణం వాటిపై అత్యాచారం జరగడమే. ముఖ్యంగా 2021 నుండి సుమారు ఇరవై మంది రైతులకు చెందిన ఆవులపై అత్యాచారం(Rape) జరిగింది. అయితే ఈ విషయం ముందుగా రైతులకు తెలియక తికమక పడ్డారు. స్థానికంగా సీసీ కేమెరాలను(cc camera) ఏర్పాటు చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.
Also Read: Kerala: ఆ పండు తినడం వల్లే బాలుడికి నిఫా వైరస్ సోకిందా?
నిందితులు ఆవుల(Cows)పై అత్యాచారం చేయడంతో పాటు వాటిని విచక్షణ రహితంగా కొట్టడం వాటి పాలిచ్చే పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చడంతోపాటు వాటి జననాంగాల్లో కూడా కట్టెలు పెట్టడం లాంటి నీచమైన పనులకు దిగడం చూశారు. ఈ క్రమంలోనే ఏడు ఆవులున్న ఓ రైతు(Farmer) ఏకంగా ఆ బాధలు భరించలేక ఐదింటిని అమ్ముకున్నాడట.. అయితే వ్యక్తిగతంగా ఎవరో కక్షగట్టి ఇలా చేస్తున్నారని భావించిన రైతుకు ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఇలా ఒక్క రైతుకు చెందిన ఆవులనే కాదు.. ఆ గ్రామంలోని మరో ఇరవైమందికి చెందిన ఆవులపై కూడా ఇలాగే అత్యాచారం జరిగిందని చెబుతున్నారు. దీంతో వారంతా కలిసి ఓ రోజు నిందితున్ని పట్టుకున్నారు. అనంతరం వాడిని స్థానిక పోలీసులకు (police)అప్పగించారు. అయితే ఆవులపై అత్యాచారం చేస్తున్న నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా నోరు లేని పశులపై ఇలా చేయడం పై ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook