Fake Baba : తల్లి ఆరోగ్యం బాగా చేస్తానని నమ్మించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై బాబా అత్యాచారం
. two sisters molested by baba in old city of hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో (old city) మంత్రాలతో వైద్యం పేరుతో ఓ దొంగ బాబా ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లి వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాబా ముసుగులో ఈ కేటుగాళ్లు మహిళలు, యువతులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. బాబా అంటూ తన దగ్గరి వచ్చిన వారిపై చాలా కాలంగా ఇలాంటి ఘాతుకాలకే పాల్పడ్డారు.
Fake Baba and his son arrested for molested two sisters in old city hyderabad : మూఢ నమ్మకాలతో చాలా మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉండడం మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఉదంతమే ఒకటి తాజాగా హైదరాబాద్ వెలుగుచూసింది. హైదరాబాద్ పాతబస్తీలో (old city) మంత్రాలతో వైద్యం పేరుతో ఓ దొంగ బాబా ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లి వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాబా ముసుగులో ఈ కేటుగాళ్లు మహిళలు, యువతులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. బాబా అంటూ తన దగ్గరి వచ్చిన వారిపై చాలా కాలంగా ఇలాంటి ఘాతుకాలకే పాల్పడ్డారు.
అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్దరు యువతులు.. హైదరాబాద్ పాతబస్తీలోని (old city hyderabad) బాబా సయ్యద్ హసన్ అక్సారిని (Baba Syed Hasan Aksari) ఆశ్రయించారు. అయితే ఆ ఇద్దరు యువతులపై కన్నేశాడు బాబా. మంత్రాల పేరు చెప్పి సదరు బాబా అక్కాచెల్లెళ్లపై (two sisters) అత్యాచారానికి తెగబడ్డాడు.
Also Read : Coal Mine Tragedy: రష్యా బొగ్గు గనిలో భారీ ప్రమాదం-52 మంది కార్మికులు మృతి
తల్లికి వైద్యం చేస్తూనే.. ఆమె కుమార్తెలపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వీరిలో ఒకరికి పెళ్లి అయ్యింది. అయితే ఆమెకు విడాకులు కూడా ఇప్పించి దారుణాలకు పాల్పడ్డాడు. ఆ వివాహితపై బాబా కుమారుడు కూడా అత్యాచారం చేశాడు. అక్కాచెల్లెళ్లను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, ఆర్థికంగా (Financially) కుంగదీశారు. చివరకు అసలు విషయం తెలుసుకున్న బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబా సయ్యద్ హసన్ అక్సారితో పాటు అతడి కుమారుడు సయ్యద్ అఫ్రోజ్‌ను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు.
Also Read : Samantha Hollywood Movie:'సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా'..: సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook