Jagga Reddy Fake Facebook: సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ అకౌంట్స్‌ పెరిగిపోతున్నాయి. సైబర్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా కూడా కొందరు కేటుగాళ్లు వారికి దొరకకుండా తమ ఆగడాల్ని కొనసాగిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలతో పాటు సామాన్యుల సోషల్ మీడియా (Social Media) ఫేక్‌ అకౌంట్స్‌ను క్రియేట్ చేస్తూ మోసాలకు పాల్పడతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేటుగాళ్లు రాజకీయ నాయకులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. (TPCC Working President) ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు మీద సోషల్ మీడియాలో ఒక ఫేక్‌ అకౌంట్ క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు మీద అమ్మాయిల ఫోటోలతో ఒక ఫేస్‌బుక్‌ ఐడీ సృష్టించారు. 


అయితే ఈ విషయం జగ్గారెడ్డికి తెలియడంతో వెంటనే ఆయన అలెర్ట్‌ అయి తన అనుచరులను అప్రమత్తం చేశారు. తన పేరు మీద కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని జగ్గారెడ్డి (Jagga Reddy) తన అనుచరగణానికి తెలిపారు. అలాగే ఆ ఫేక్ అకౌంట్‌లో అమ్మాయిల ఫోటోలను అప్‌లోడ్ చేశారని పేర్కొనారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేందుకు కొందరు కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 


ఇక ఫేక్ ఫేస్‌బుక్‌ ఐడీ క్రియేట్‌ చేయడంపై సైబర్ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్‌ చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తన పేరు మీద కొత్తగా ఫేస్‌బుక్‌లో (Facebook) క్రియేట్ అయిన ఐడీ తనది కాదని జగ్గారెడ్డి (Jagga Reddy) క్లారిటీ ఇచ్చారు. సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) విషయంలో జనాలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.


Also Read: MS Dhoni Atharva: మైథలాజికల్ సూపర్ హీరోగా ధోనీ.. కొత్త అవతార్‌లో అదుర్స్..


Also Read: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు గ్రీన్ సిగ్నల్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook